Share News

MLA: నివాసయోగ్యమైన స్థలాలను గుర్తించండి

ABN , Publish Date - Oct 28 , 2025 | 10:43 PM

ఇళ్లులేని నిరుపేదల కోసం ఉపయోగకరమైన నివాస స్థలాలను వెంటనే గుర్తించాలని పుట్టప ర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి రెవె న్యూ అధికారులకు సూచించారు. మండల కేంద్రంలోని మామిళ్లకుంట్లపల్లి పంచాయతీలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములతో పాటు గతంలో ప్రభు త్వం పేదలకు కేటాయించిన ఎన్టీఆర్‌కాలనీ ప్రాంతాన్ని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలిసి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పరిశీలించారు.

MLA: నివాసయోగ్యమైన స్థలాలను గుర్తించండి
MLA and former minister inspecting the site of the statue

రెవెన్యూ అధికారులకు ఎమ్మెల్యే సింధూరరెడ్డి సూచన

ఓబుళదేవరచెరువు, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఇళ్లులేని నిరుపేదల కోసం ఉపయోగకరమైన నివాస స్థలాలను వెంటనే గుర్తించాలని పుట్టప ర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి రెవె న్యూ అధికారులకు సూచించారు. మండల కేంద్రంలోని మామిళ్లకుంట్లపల్లి పంచాయతీలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములతో పాటు గతంలో ప్రభు త్వం పేదలకు కేటాయించిన ఎన్టీఆర్‌కాలనీ ప్రాంతాన్ని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలిసి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పరిశీలించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయ కులతో పాల్గొన్నారు. ముందుగా వడ్డెర కమ్యూనిటీ భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించి, నిర్మాణ పనులకు ఎదురవుతున్న అడ్డంకులపై రెవెన్యూ అధికారులతో ఆరాతీశారు. రెవెన్యూ అఽధికారులు సోషల్‌ వెల్ఫేర్‌ అఽధికారులు సమన్వయంతో పని చేసి పనులు వేగవంతం చేయాలని సూచిం చారు.


అదేవిధంగా మహమ్మదాబాద్‌ క్రాసింగ్‌, వేమారెడ్డిపల్లి, కొండకమర్ల జంక్షన, ఎం.కొత్త పల్లి రెవెన్యూ పొలం, ఇనుగలూరు పొలంలోని ప్రభుత్వ భూములను వారు పరిశీలించారు. అదేవిధంగా ఎన్టీఆర్‌, వడ్డె ఓబన్న, శ్రీకృష్ణదేవరాయులు, యోగివేమన తదితర విగ్రహాల ఏ ర్పాటు కోసం వారు స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి మా ట్లాడుతూ ప్రజా అవసరాల కోసం ప్రభుత్వ భూములను గుర్తించి, వాటిని సంరక్షించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కంచె ఏర్పాటు చేయాలన్నారు. త్వరలో ప్రభుత్వం పేదలకు ఇంటి స్థలాలు, నూతనంగా ఎన్టీఆర్‌ గృహాలు మంజూరు చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ పిట్టా ఓబుల్‌ఎడ్డి, టీడీపీ మండల కన్వీనర్‌ శెట్టివారి జయచంద్ర, నాయకులు తుమ్మల మహబూబ్‌బాషా, నిజాం, కంచి సురేష్‌, మస్తానమ్మ, బుద్దల ప్రవీణ గోపినాథ్‌రెడ్డి, బీజేపి మండల అధ్యక్షుడు ఇడగట్టు వీరాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Oct 28 , 2025 | 10:43 PM