Share News

FESTIVAL: మానవతా విలువలు పాటించాలి

ABN , Publish Date - Sep 06 , 2025 | 12:33 AM

మహమ్మద్‌ప్రవక్త చెప్పిన విధంగా మానవతా విలువలు పాటిస్తూ పరమత సహనం, శాంతి, కలిగి ఉండాలని, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పే ర్కొన్నారు. మిలాద్‌ ఉన నబీ సందర్భంగా ముస్లింలు శుక్రవారం పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రవక్త చెప్పిన సందేశాలు అందరికి ఆచర ణీయమే అన్నారు. ప్రతి ఒకరు వీటిని పాటించాలన్నారు.

FESTIVAL: మానవతా విలువలు పాటించాలి
MLA Kandikunta participated in Milad Una Nabi rally

ఎమ్మెల్యే కందికుంట - ఘనంగా మిలాద్‌-ఉన-నబి

కదిరి/ధర్మవరం, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): మహమ్మద్‌ప్రవక్త చెప్పిన విధంగా మానవతా విలువలు పాటిస్తూ పరమత సహనం, శాంతి, కలిగి ఉండాలని, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పే ర్కొన్నారు. మిలాద్‌ ఉన నబీ సందర్భంగా ముస్లింలు శుక్రవారం పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రవక్త చెప్పిన సందేశాలు అందరికి ఆచర ణీయమే అన్నారు. ప్రతి ఒకరు వీటిని పాటించాలన్నారు. ఈ ర్యా లీలో ముస్లిం పెద్దలు, టీడీపీ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. అలాగే ధర్మవరం పట్టణంలో ముస్లింలు మహమ్మద్‌ ప్ర వక్తకు సంబంధిం చిన జెండాలను చే తపట్టుకుని ప్రదా న రహదారులలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని సీఐ నాగేంద్ర ప్రసా ద్‌ ప్రారంభించారు. అంతకుమునుపు చెరువుకట్ట వద్ద దర్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే తాడిమర్రిలోని మసీదులో మిలాద్‌ ఉన నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముస్లిలందరూ మ సీదు వద్దకు చేరుకుని ప్రార్థనలు చేశారు. తనకల్లులో మిలాద్‌ ఉన నబీని పురస్కరించుకుని మండలకేంద్రంలో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. ముస్లింలు బీఎల్‌ అబ్దుల్‌కలాం, నిజాం తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Sep 06 , 2025 | 12:33 AM