WATER: ఇలా ఉంటే ఎలా వెళ్లేది?
ABN , Publish Date - Oct 11 , 2025 | 12:22 AM
మండల కేంద్రంలోని ధర్మవరం రహదారికి ఇరువైపులా ఉన్న ఇళ్ల ఎదుట వర్షపునీరు ని లబడడంతో స్థానికులు చాలా ఇబ్బందులు పడు తున్నారు. ఇటీ వల ఆర్‌అండ్‌బీ అధికారులు రోడ్డు విస్తరణ పనులను చేపట్టారు.
కొత్తచెరువు, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ధర్మవరం రహదారికి ఇరువైపులా ఉన్న ఇళ్ల ఎదుట వర్షపునీరు ని లబడడంతో స్థానికులు చాలా ఇబ్బందులు పడు తున్నారు. ఇటీ వల ఆర్‌అండ్‌బీ అధికారులు రోడ్డు విస్తరణ పనులను చేపట్టారు. ఇందులో భాగంగా రోడ్డుకు పక్కన ఉన్న మట్టిని ఎక్స్‌వేటర్లతో తొలగించారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా గుంతలు ఏర్పడ్డాయి. రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వర్షపు నీరు ఇళ్ల ఎదుట ఉన్న గుంతల్లోకి చేరింది. దీంతో ఇళ్లలోకి వెళ్లేందుకు, ఇళ్ల నుంచి బయటకు వచ్చేం దుకు ఇబ్బందిగా ఉందని ప్రజలు వాపో తున్నారు. ఇప్పటికైనా ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి త్వరగా రోడ్డు పనులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.