Share News

CRICKET: హోరాహోరీగా క్రికెట్‌ టోర్నీ

ABN , Publish Date - Sep 04 , 2025 | 12:22 AM

పట్టణంలోని ఆర్డీటీ క్రీడామైదానంలో జరుగుతున్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి స్మారక క్రికెట్‌ టోర్నీ సీజన-2 మ్యాచలో హోరాహోరీగా సాగుతున్నాయి. బుధవారం మొ దటి మ్యాచలో ఫ్రెండ్స్‌ లెవన్స జట్టుపై గణేష్‌ ఫ్రెండ్స్‌ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండోమ్యాచలో నాయక్‌ వారియర్స్‌ జట్టుపై లక్ష్మీ నరసింహ లెవెన్స జట్టు విజయం సాధించింది.

CRICKET: హోరాహోరీగా క్రికెట్‌ టోర్నీ
Leaders presenting shields to athletes

ధర్మవరంరూరల్‌, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఆర్డీటీ క్రీడామైదానంలో జరుగుతున్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి స్మారక క్రికెట్‌ టోర్నీ సీజన-2 మ్యాచలో హోరాహోరీగా సాగుతున్నాయి. బుధవారం మొ దటి మ్యాచలో ఫ్రెండ్స్‌ లెవన్స జట్టుపై గణేష్‌ ఫ్రెండ్స్‌ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండోమ్యాచలో నాయక్‌ వారియర్స్‌ జట్టుపై లక్ష్మీ నరసింహ లెవెన్స జట్టు విజయం సాధించింది. మూడో మ్యాచలో బసంపల్లి జట్టుపై కొండకమర్ల సూపర్‌కిం గ్స్‌ జట్టు 7 వికెట్ల తేడాతో విజయకేతనం ఎగురవేసింది. రోజంతా ఉత్కంఠభరితం గా సాగిన పోటీల్లో క్రీడాకారులు బౌలింగ్‌, బ్యాటింగ్‌లో తమ ప్రతిభను చాటుకు న్నారు. ఈ మ్యాచుల్లో ప్రతిభ కనబరచిన క్రీడాకారులకు అవార్డులను అందజేశారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ బహుమతులను గె లుచుకున్న షేక్‌హుస్సేన, దివాకర్‌, ప్రసా ద్‌ను బీజేపీ నాయకులు, సీనియర్‌ ఆట గాళ్లు, కోచలు షీల్డులు అందజేసి అభినంద నలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ హారీష్‌బాబు, కోచలు పృథ్వి, రాజేశేఖర్‌, బీజేపీ నాయకులు అంగజాల రాజు, భాస్కర్‌, సీనియర్‌ ప్లేయర్‌లు విశ్వనాథ్‌, దంపెట్ల వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Sep 04 , 2025 | 12:22 AM