FORMER MINISTER: పేదలకు తోడ్పాటు అందించాలి
ABN , Publish Date - Dec 11 , 2025 | 11:33 PM
ప్రతి మనిషీ జీవితంలో ఎంతోకొంత సమాజాభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ, పేదలకు ఆర్థికసా యం అందిస్తే మనిషి జీవితానికి సార్థకత లభి స్తుందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని వక్ఫ్ బోర్డు నుంచి మస్తానవలీ దర్గా వరకు ముతవల్లి మాణిక్యంబాబా ఆధ్వర్యంలో వంద మంది పేద, వితంతు, ఒంటరి మహిళలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు.
ఫమాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి
కొత్తచెరువు, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): ప్రతి మనిషీ జీవితంలో ఎంతోకొంత సమాజాభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ, పేదలకు ఆర్థికసా యం అందిస్తే మనిషి జీవితానికి సార్థకత లభి స్తుందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని వక్ఫ్ బోర్డు నుంచి మస్తానవలీ దర్గా వరకు ముతవల్లి మాణిక్యంబాబా ఆధ్వర్యంలో వంద మంది పేద, వితంతు, ఒంటరి మహిళలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హాజరై, వారికి నిత్యావసర వస్తువుల కిట్లను అందజేశారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి మాట్లాడుతూ... ప్రతి ఒక్కరు సంపాదించిన దానిలోని కొంత పేదలకు ఆర్థికసాయం అందజే స్తే ఆ కుటుంబాలకు మేలు చేసిన వారవుతారన్నారు.
పవిత్రమైన ఖు రాన గ్రంథంలోనూ పది మందికి సాయం చేస్తే అలాంటి వారికి పుణ్య లోకం లభిస్తుందనే విషయం ఉందని గుర్తుచేశారు. 2014-17 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనకు మైనార్టీ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించగా, రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల అభివృద్ధికి కృషిచేశానన్నారు. షాదీమహళ్లు, మసీదుల అబివృ ద్ధికి విరివిగా నిధులు కేటాయించామన్నారు. మాణిక్యంబాబా పేద ముస్లిం కోసం నిత్యవసర వస్తువులను వక్ఫ్‌బోర్డు అందిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన పూలశివ, టీడీపీ నాయకులు శ్రీనివాసులు, పట్టణ, మండల కన్వీనర్‌లు ఒలిపిశీన, రామకృష్ణ, మైనార్టీనాయకులు సైకిల్‌షాపు బాబా, షర్పుద్దీన, జబీ, షఫీ, భాస్కర్, హర్ష, బాషా, కూటమి నాయకులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....