Share News

AGRICULTURE: గ్రామం యూనిట్‌గా పంటకోత ప్రయోగాలు

ABN , Publish Date - Sep 28 , 2025 | 12:40 AM

జిల్లాలో గ్రామం ఇన్సూరెన్సు యూనిట్‌గా పంటకోత ప్రయోగాలు చేపట్టేందుకు కందిపం టను ఎంపిక చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి రామునాయక్‌, జిల్లా ఆర్థిక గణాంకాధికారి (సీపీఓ) విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. పంటకోత ప్రయోగాలపై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని ఎం పీడీఓ కార్యాలయంలో శనివారం నిర్వహించారు.

AGRICULTURE: గ్రామం యూనిట్‌గా పంటకోత ప్రయోగాలు
CPO Vijaykumar speaking in the program

శిక్షణ కార్యక్రమంలో సీపీఓ విజయ్‌కుమార్‌

పుట్టపర్తి రూరల్‌, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రామం ఇన్సూరెన్సు యూనిట్‌గా పంటకోత ప్రయోగాలు చేపట్టేందుకు కందిపం టను ఎంపిక చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి రామునాయక్‌, జిల్లా ఆర్థిక గణాంకాధికారి (సీపీఓ) విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. పంటకోత ప్రయోగాలపై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని ఎం పీడీఓ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధి కారి, జిల్లా ఆర్థిక గణాంకాధికారి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి జిల్లాలోని అన్ని మండలాల వ్యవసాయ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా సీపీఓ, జిల్లా వ్యవసాయాధికారి మా ట్లాడుతూ జిల్లాలో గ్రామం ఇన్సూరెన్సు యూనిట్‌గా పంటకోత ప్రయో గాలు చేపట్టేందుకు కందిపంటను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. జి ల్లాలో 141 యూనిట్లలో మొత్తం 720 పంటకోత ప్రయోగాలు చేపట్టాలని అదికారులకు సూచించారు. మొబైల్‌యాప్‌ వినియోగం పంటకోత ప్రయోగం ప్రక్రియపై పవర్‌పాయంట్‌ ప్రజంటేషన ద్వారా అధికారులకు శిక్షణ కల్పించారు. ఈ కార్యక్రమంలో డీఐఎస్‌ఓ శ్రీనివాస్‌నాయక్‌, జిల్లా ఉద్యానశాఖాధికారి చంద్రశేఖర్‌, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన. డివిజన స్థాయి ఏడీఏలు, మండల వ్యవసాయి అదికారులు, హెచఓలు, ఏఎస్‌ఓలు, ఏఈఓలు తదితర సిబ్బంది పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Sep 28 , 2025 | 12:41 AM