Share News

TDP: మైనింగ్‌ లీజుల్లో రాయితీపై హర్షం

ABN , Publish Date - Oct 19 , 2025 | 11:33 PM

మైనింగ్‌ లీజులకు సంబంధించి వడ్డెర్లకు రా యితీని కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబా బు నాయుడు తీసుకున్న నిర్ణయంపై వడ్డెర్ల తర ఫున హర్షం వ్యక్తం చేస్తున్నట్టు వడ్డెర కార్పొ రేషన డైరెక్టర్‌ ఒలిపి శీన పేర్కొన్నారు. మం డల కేంద్రంలోని బీసీకాలనీలో ఆదివారం వ డ్డెర్లు సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి చిత్రపటాలకు క్షీరాభి షేకం చేశారు.

TDP: మైనింగ్‌ లీజుల్లో రాయితీపై హర్షం
Vaddera caste people anointing the portraits of CM and MLA

సీఎం చిత్రపటానికి వడ్డెర్ల క్షీరాభిషేకం

కొత్తచెరువు, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): మైనింగ్‌ లీజులకు సంబంధించి వడ్డెర్లకు రా యితీని కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబా బు నాయుడు తీసుకున్న నిర్ణయంపై వడ్డెర్ల తర ఫున హర్షం వ్యక్తం చేస్తున్నట్టు వడ్డెర కార్పొ రేషన డైరెక్టర్‌ ఒలిపి శీన పేర్కొన్నారు. మం డల కేంద్రంలోని బీసీకాలనీలో ఆదివారం వ డ్డెర్లు సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి చిత్రపటాలకు క్షీరాభి షేకం చేశారు. ఈ సంద ర్భంగా ఒలిపి శీన మాట్లా డుతూ... ఎన్నికల సమ యంలో ఇచ్చిన హామీ మే రకు వడ్డెర్లకు రోడ్డు మె టల్‌, ఇతర గనుల లీజుల కేటాయింపుపై ఎమ్మెల్యే ప ల్లె సింఽధూరరెడ్డి అ సెంబ్లీ లో ప్రస్తావించారన్నారు. దీంతో సీఎం చంద్ర బాబు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చర్చించి వడ్డెర్లకు మైనింగ్‌ లీజుపై విధివిధా నాలను రూపొందించడానికి కమిటీ వేశార న్నారు. దీంతో కులవృత్తులనే నమ్ముకుని బతుకుతన్న తమకు మైనింగ్‌ లీజుల్లో రాయితీలు తమ జీవన ప్రమాణాలను పెంచుతాయని ఆయన పేర్కొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Oct 19 , 2025 | 11:33 PM