FLAG: ఘనంగా హర్ ఘర్ తిరంగా
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:09 AM
ప్రతి ఒక్కరు జాతీయ భావం పెంపొందించుకోవాలని కలెక్టర్ చేతన పిలుపునిచ్చారు. హర్‌ఘర్ తిరంగా ర్యాలీలో భాగంగా గురువారం సత్యసాయి సూపర్‌స్పెషలిటీ ఆసుపత్రి నుంచి వై జంక్షన వరకు నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. వైజంక్షన వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. దేశభక్తి ఉట్టిపడేలా అందరిచేత కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.
పుట్టపర్తి టౌన, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరు జాతీయ భావం పెంపొందించుకోవాలని కలెక్టర్ చేతన పిలుపునిచ్చారు. హర్‌ఘర్ తిరంగా ర్యాలీలో భాగంగా గురువారం సత్యసాయి సూపర్‌స్పెషలిటీ ఆసుపత్రి నుంచి వై జంక్షన వరకు నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. వైజంక్షన వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. దేశభక్తి ఉట్టిపడేలా అందరిచేత కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. కలెక్టర్ మాట్లాడుతూ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ క్రిష్టప్ప, డీఏఓ సుబ్బారావు, డీఎంహెచఓ ఫైరోజ్‌బేగం, డీపీఓ సమత, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే ధర్మవరం రేల్వే స్టేషన, తాడిమర్రి, ముదిగుబ్బ, అమడగూరులో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....