Har Ghar Tiranga : హర్ ఘర్ తిరంగా
ABN , Publish Date - Aug 11 , 2025 | 12:51 AM
బీజేపీ ఆధ్వర్యంలో నగరంలో ఆదివారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కృష్ణకళామందిరం నుంచి టవర్‌క్లాక్, సుభా్‌షరోడ్డు మీదుగా సప్తగిరి సర్కిల్ వరకు జాతీయ జెండాలు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ...
అనంతపురం క్లాక్‌టవర్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): బీజేపీ ఆధ్వర్యంలో నగరంలో ఆదివారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కృష్ణకళామందిరం నుంచి టవర్‌క్లాక్, సుభా్‌షరోడ్డు మీదుగా సప్తగిరి సర్కిల్ వరకు జాతీయ జెండాలు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ జాతీయతను చాటేందుకు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో సెంట్రల్ యూనివర్శిటీ వీసీ ఎస్‌ఏ కోరి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మైదుకూరు ఆంజనేయులు, నేతలు సందిరెడ్డి శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డి, చిరంజీవిరెడ్డి, అశోక్‌రెడ్డి, పైలా నరసింహయ్య, రత్నమయ్య పాల్గొన్నారు.