MLA: స్ర్తీ శక్తితో మహిళల్లో ఆనందం
ABN , Publish Date - Sep 01 , 2025 | 11:53 PM
స్ర్తీ శక్తి పథకంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళల్లో ఆనందం కనిపిస్తోందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక పీవీ అర్ గ్రాండ్‌లో సోమవారం స్ర్తీ శక్తి పథకం విజయోజత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... తల్లికివందనం పథకం అమలు చేసినప్పుడు ఇచ్చిన మా ట నిలబెట్టుకునే ప్రభుత్వంగా ప్రజలు భావించారని, ఇప్పుడు స్ర్తీ శక్తి పథకంతో మహిళలకు ప్రభుత్వం పట్ల పూర్తి విశ్వాసం కలిగిందని అన్నా రు.
ఎమ్మెల్యే కందికుంట
కదిరి, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): స్ర్తీ శక్తి పథకంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళల్లో ఆనందం కనిపిస్తోందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక పీవీ అర్ గ్రాండ్‌లో సోమవారం స్ర్తీ శక్తి పథకం విజయోజత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... తల్లికివందనం పథకం అమలు చేసినప్పుడు ఇచ్చిన మా ట నిలబెట్టుకునే ప్రభుత్వంగా ప్రజలు భావించారని, ఇప్పుడు స్ర్తీ శక్తి పథకంతో మహిళలకు ప్రభుత్వం పట్ల పూర్తి విశ్వాసం కలిగిందని అన్నా రు. ‘సూపర్ సిక్స్ సూపర్‌హిట్’ అనే మాట రాష్ట్ర మంతా మార్మోగు తుంటే వైసీపీ వారికి మాత్రం కళ్లు, చెవులు రెండూ పనిచేయడం లేదని ఎద్దేవ చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, మున్సిపల్ చైర్‌పర్సన దిల్‌షాదున్నీషా, స్వచ్ఛంద కార్పొరేషన డైరెక్టర్ పర్వీనబాను, జనసేన నాయకులు భైరవ ప్రసాద్, ఏపీఎం జయంతి తదితరులు మా ట్లాడారు. ఈ సందర్భంగా 3,330 మంది మహిళ సంఘాలకు సభ్యులకు మంజూరైన రూ.28.23 కోట్లు, స్ర్తీ నిధి ద్వారా 1127 మంది మహిళలకు మంజూరైన రూ.9.52 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన సుధారాణి, మార్కెట్ యార్డు వైస్ చైర్మన కొమ్మినేని గంగయ్య నాయుడు, టీడీపీ నాయకులు డైమండ్ ఇర్ఫాన, బహుద్దీన, సిరి బాబాయ్య, పలువురు ప్రజాప్రతినిధులు, టీడీపీ కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్యే కంది కుంట పట్టణంలోని 16వ వార్డులో సోమవారం పింఛన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన దిల్‌షాదున్నిసా, టీడీపీ నాయకులు అనిల్ కుమార్ రెడ్డి, పాల రమణ, తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....