Share News

WATER: హంద్రీనీవా నీరు వచ్చేనా..?

ABN , Publish Date - Sep 07 , 2025 | 11:10 PM

మండలానికి హంద్రీనీవా కాలువ నీరు వచ్చేనా? అనే ప్రశ్న రైతుల్లో నెలకొంది. హంద్రీనీవా కాలువ నీరు జిల్లాలు దాటి కుప్పానికి వెళ్తోంది. అయితే గాండ్లపెంట మండలానికి రాకపోవడంతో మండల రైతుల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఉమ్మడి జి ల్లాలోని అత్యంత మెట్ట ప్రాంతం ఉన్న, అత్యల్ప వర్షపాతం నమోదు అ య్యే గాండ్లపెంట మండలానికి కాలువల ద్వారా నీరు వస్తే రైతులు పంట లు సాగుచేసుకుని జీవనం సాగించవచ్చు.

WATER:  హంద్రీనీవా నీరు వచ్చేనా..?
Poreddyvaripalli pond that has dried up

కార్యరూపం దాల్చని ఎత్తిపోతల పథకం పనులు

సన్నగిల్లుతున్న మండల రైతుల ఆశలు

గాండ్లపెంట, సెప్టెంబరు5 (ఆంధ్రజ్యోతి): మండలానికి హంద్రీనీవా కాలువ నీరు వచ్చేనా? అనే ప్రశ్న రైతుల్లో నెలకొంది. హంద్రీనీవా కాలువ నీరు జిల్లాలు దాటి కుప్పానికి వెళ్తోంది. అయితే గాండ్లపెంట మండలానికి రాకపోవడంతో మండల రైతుల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఉమ్మడి జి ల్లాలోని అత్యంత మెట్ట ప్రాంతం ఉన్న, అత్యల్ప వర్షపాతం నమోదు అ య్యే గాండ్లపెంట మండలానికి కాలువల ద్వారా నీరు వస్తే రైతులు పంట లు సాగుచేసుకుని జీవనం సాగించవచ్చు. హంద్రీనీవా నీరు మండలానికి రప్పిస్తామంటూ ఎన్నికల ముందు నాయకులు హామీలు గుప్పించారేకానీ, కార్యరూపం దాల్చలేదు. మండల వ్యాప్తంగా వందకు పైగా చెరువు లు ఉ న్నాయి. భారీ వర్షాలు కురిస్తేనే అవి నిండుతాయి. అరకొర వర్షాలకు చుక్కనీర ఉండదు. మండలంలో ప్రజలు ప్రధానంగా వ్యవసాయంపైనే ఆ ధారపడి జీవనం సాగిస్తున్నారు. బోర్లలో నీరు అడుగంటి పోవడంతో పం టలు సాగుచేయలేకపోతున్నారు. ప్రధానంగా ఖరీఫ్‌లో వర్షాధారం కింద వేరుశనగ సాగుచేస్తారు. అయితే అతివృష్టి, అనావృష్టి కారణంగా పెట్టుబ డులు దక్కని పరిస్థితిలో దాదాపు రైతులందరూ ఖరీఫ్‌లో వేరుశనగను వదలేసి, బోర్లకింద మాత్రమే పంటలు సాగుచేస్తున్నారు. అయితే బోర్లు ఎండిపోయి ఎంతోమంది నష్టాలు చవి చూశారు. అలాంటి మండలంపై ఏ నాయకుడూ కరుణ చూపడం లేదని మండల రైతులు విమర్శిస్తున్నారు.

ఇరువైపులా హంద్రీనీవా కాలువలు

మండలానికి ఇరువైపుల హంద్రీనీవా కాలువలు వెళ్తున్నాయి. ఒక వైపు తలుపుల మండలం మీదుగా, మరోవైపు నల్లచెరువు మీదుగా ఉన్నాయి. గాండ్లపెంట మండలం అత్యంత ఎత్తులో ఉండడంతో హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు రావాలంటే ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేయాలి.


దీనిపై ఎమ్మెల్యే కందికుంట అసెంబ్లీలో చర్చించి, సంబంధిత ప్రణాళికలు ముం దుకు సాగేందుకు చొరవ చూపుతున్నారు. మండలానికి సమీపంలోని న ల్లచెరువు వద్ద హంద్రీనీవా కాలువ నీరు వెళ్తోంది. గాండ్లపెంటకు ఆ నీరు రావాలంటే సామచేనుబైలు వద్ద ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయాలి. దానిద్వారా చెరువులకు నీరు అందించవచ్చు. అలాగే కదిరి రూరల్‌ మం డలానికి నీరు చేరే అవకాశముంది. హంద్రీనీవా ఎత్తిపోతుల పథకానికి రూ.60కోట్లు ఖర్చు అవుతుందని, ఇరిగేషన అధికారులు ప్రణాళికలను త యారు చేసి, ఉన్నతాధికారులకు పంపారు. అయితే కార్యరూపం దాల్చ లేదు. మండలంలో చాలామంది రైతులు ఇప్పటికే ప్రధానంగా ఉద్యాన పంటలపై దృష్టి సారించి, పలు రకాల పండ్ల తోటలు విరివిగా సాగుచేస్తు న్నారు. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో మండలంలోని చెరువులు ఎండిపోయాయి. దీంతో భూగర్భ జలాలు అడుగంటి పలువురి ఉద్యాన పంటల ఎండిపోయాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మండ లానికి హంద్రీనీవా నీరు తీసుకురావాలని రైతులు కోరుతున్నారు

నివేదికలు పంపాం - అరుణకుమారి, జేఈ, ఇరిగేషన

హంద్రీనీవా ఎత్తిపోతల పథకం కోసం ఉన్నతాధికారులకు నివేదికలు పంపాం. వారి నుంచి అనుమతులు వస్తే, సామచేనుబైలు నుంచి ఎత్తిపో తల పథకం చేపడతాం. మండలంలోని చెరువులను నీటితో నింపేందుకు అవకాశముంటుంది.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Sep 07 , 2025 | 11:10 PM