BJP: జీఎస్టీ తగ్గింపుతో మధ్యతరగతికి మేలు
ABN , Publish Date - Sep 23 , 2025 | 12:37 AM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయం ద్వారా జీఎస్టీ తగ్గి మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేకూర్చారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జీఎంశేఖర్ తెలిపారు. పుట్టపర్తిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
బీజేపీ జిల్లా అధ్యక్షడు జీఎం శేఖర్
పుట్టపర్తి, సెప్టెంబరు 22(ఆంద్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయం ద్వారా జీఎస్టీ తగ్గి మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేకూర్చారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జీఎంశేఖర్ తెలిపారు. పుట్టపర్తిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఆ పార్టీ నాయకులు కొండమ రాజు, లాయర్ హరికృష్ణ, సురేశ, కల్యాణ్, బాలగంగాధర్, సునీల్‌వైట్ల పాల్గొన్నారు.
ధర్మవరం/ ఓబుళదేవరచెరువు/ అమడగూరు: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ ఆదేశాల మేరకు సోమవారం పట్టణంలోని కాలేజ్ సర్కిల్‌లో ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన జీఎస్టీ సంస్కరణలకు మద్దతుగా ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాకే ఓబుళేశు, పట్టణ అధ్యక్షుడు జింకా చంద్ర తదితరులు పాల్గొన్నారు. అలాగే ఓబుళదేవరచెరువులోని అంబేడ్కర్ సర్కిల్‌లో బీజేపీ మండలాధ్యక్షుడు ఇడగొట్టు వీరాంజి ఆధ్వర్యంలో పీఎం నరేంద్రమోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అమడగూరు లోని మోదీ చిత్రపటానికి బీజేపీ నాయకులు క్షీరాభిషేకం చేశారు.