MLA: లాభదాయకమైన పంటలు సాగుచేయండి
ABN , Publish Date - Nov 27 , 2025 | 12:24 AM
లాభదాయకమైన పంట లు సాగుచేసి అధిక ఆదాయాన్ని పొందాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి రైతులకు సూచించారు. మండలం కేంద్రమైన బుక్కపట్నంలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైతన్నా... మీ కోసం’ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలిసి ఎమ్మె ల్యే పల్లె సింధూర రెడ్డి పాల్గొన్నారు.
ఎమ్యెల్యే సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె
బుక్కపట్నం, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): లాభదాయకమైన పంట లు సాగుచేసి అధిక ఆదాయాన్ని పొందాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి రైతులకు సూచించారు. మండలం కేంద్రమైన బుక్కపట్నంలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైతన్నా... మీ కోసం’ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలిసి ఎమ్మె ల్యే పల్లె సింధూర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ... గతంలో వర్షాభావ పరిస్థితుల వల్ల కరువు ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహ కారంతో కృష్ణజలాలు తీసుకురావడం వల్ల అన్ని చెరువులు జలకళ సంతరించుకున్నాయని పేర్కొన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేయా లనే సంకల్పంతో అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలను కూటమి ప్ర భుత్వం చేపడుతోంద తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయా ధికారి రాము నాయక్, మండల వ్యవసాయాధికారి నటరాజ్, మండల ప్రజా ప్రతినిధులు చెన్నకృష్ణ, యశోద, శ్రీనివాసులు, టీడీపీ మండల క న్వీనర్ మల్లిరెడ్డి, గంగాధర్, బాబు, దాసరి శ్రీనివాసులు, మంజు, వెంక టసుబ్బారెడ్డి, వెంకట నారాయణరెడ్డి, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే బుక్కపట్నంలో బుధవారం మృతిచెందిన పెదరాసు నాగభూష ణం కుటుంబాన్ని ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరామర్శించారు. పెదరాసు నాగభూషణం భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....