TDP: శ్మశానవాటిక లేక అవస్థలు
ABN , Publish Date - Dec 18 , 2025 | 12:16 AM
శ్మశానవాటిక లేకపోవడంతో ఎవరైనా చనిపోతే మా పొలాల్లోనే దహనసంస్కారాలు చేస్తున్నామని, శ్మశానవాటికకు స్థలం కేటాయించి తమ సమస్యను పరి ష్కారించాలని మండలంలోని నేలకోట గ్రామ ఎస్సీకాలనీ వాసులు బుధవారం టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్‌కు విన్నవిం చారు.
పరిటాలశ్రీరామ్, తహసీల్దార్‌కు
నేలకోట ఎస్సీకాలనీ వాసుల వినతులు
ధర్మవరంరూరల్, డిసెంబరు17(ఆంధ్రజ్యోతి): శ్మశానవాటిక లేకపోవడంతో ఎవరైనా చనిపోతే మా పొలాల్లోనే దహనసంస్కారాలు చేస్తున్నామని, శ్మశానవాటికకు స్థలం కేటాయించి తమ సమస్యను పరి ష్కారించాలని మండలంలోని నేలకోట గ్రామ ఎస్సీకాలనీ వాసులు బుధవారం టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్‌కు విన్నవిం చారు. పరిటాల శ్రీరామ్‌ను బుధవారం అనంతపురంలోని పరిటాల క్యాంపు కార్యాలయంలో కలిసి విన్నవించినట్లు కాలనీ ప్రజలు కోటప్ప, లక్ష్మీనారాయణ, నరసింహులు, మల్లేష్, గంగాద్రి తదితరులు తెలిపారు. స్పందించిన ఆయన వెంటనే తహసీల్దార్‌తో ఫోనలో మాట్లాడి శ్మశాన వాటిక సమస్యను పరిష్కరించాలని తెలిపారు. అనంతరం ధర్మవ రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సురేష్‌బాబును కలిసి వినతిపత్రం అందించినట్లు తెలిపారు. వెంటనే స్పందించిన తహసీల్దార్ వీఆర్‌ఓ విజయ్‌ను గ్రామంలో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలని ఆదేశించా రన్నారు. త్వరలోనే సమస్య పరిష్కారిస్తామని తెలిపారన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....