ROAD: కంకర పరిచారు...తారు మరిచారు
ABN , Publish Date - Jun 18 , 2025 | 12:08 AM
గత వైసీపీ పాలనలో మండలపరిధి లోని నక్కరాళ్లతండా గ్రామం నుంచి నడిమికుంటపల్లి వరకు, అలాగే గంధోడివారిపల్లి నుంచి గంగమ్మగుడి మీదుగా, కుర్మాలపల్లి వరకు రోడ్ల నిర్మాణం చేపట్టారు. అందులో భాగంగా ఆయా రోడ్లపై కంకర పరిచారు. ఆ తరువాత పనులు చేపట్టకుండా కంకర పరిచి, అలాగే వదిలేశారు. దానిపై తారు వేయడం మరిచిపోయారు. దీంతో ఆ రోడ్ల రాకపోకలకు ఆయా గ్రామాల ప్రజలు పడుతున్న బాధలు వర్ణాణాతీతం,
తనకల్లు, జూన 17(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ పాలనలో మండలపరిధి లోని నక్కరాళ్లతండా గ్రామం నుంచి నడిమికుంటపల్లి వరకు, అలాగే గంధోడివారిపల్లి నుంచి గంగమ్మగుడి మీదుగా, కుర్మాలపల్లి వరకు రోడ్ల నిర్మాణం చేపట్టారు. అందులో భాగంగా ఆయా రోడ్లపై కంకర పరిచారు. ఆ తరువాత పనులు చేపట్టకుండా కంకర పరిచి, అలాగే వదిలేశారు. దానిపై తారు వేయడం మరిచిపోయారు. దీంతో ఆ రోడ్ల రాకపోకలకు ఆయా గ్రామాల ప్రజలు పడుతున్న బాధలు వర్ణాణాతీతం, గత రెండేళ్లు గా కంకర రోడ్డులోనే ప్రయాణం సాగించాల్సి వస్తోంది. ఇక ద్విచక్రవాహన దారులు పడే బాధలు అన్నీఇన్నీకావు. ప్రతిరోజు ఎవరో ఒకరు ద్విచక్ర వాహన దారులు ప్రమాదాలకు గురికావాల్సి వస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే తమ రోడ్ల నిర్మాణాలు చేపడుతారని ఆశించిన గ్రామస్థులకు నిరాశే ఎదురైంది. ఈ ప్రభుత్వం ఏర్పడి యేడా దైనా, ఆ రెండు కంకర రోడ్ల గురించి పట్టించుకునే నాథుడే లేకపోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకో వడంలేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ప్రజా ప్రతినిధులు, అఽధికారులు స్పందించి ఆ కంకర రోడ్లకు తారు వేసి తమకు సౌకర్యవంతమైన ప్రయాణానికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....