Share News

ROAD: కంకర తేలిన రోడ్డు

ABN , Publish Date - Nov 02 , 2025 | 11:43 PM

మండలంలోని చిన్నరామన్నగారిపల్లి పంచాయతీ కేంద్రం నుంచి ఆ పంచా యతీలోని తురకవానిపల్లికి దాదాపు 30 యేళ్ల క్రితం నిర్మించిన రోడ్డు చాలా అధ్వానంగా మారింది. కంకర తేలిన రోడ్డు ప్రయాణించేందుకు ఆ గ్రామస్థు లు చాలా అగచాట్లు పడాల్సి వస్తోంది. చిన్నరామన్నపల్లి నుంచి తురకవానిపల్లి వరకు 30 ఏళ్ల క్రితం మూడు కిలో మీటర్ల తారు రోడ్డు నిర్మాణం చేపట్టారు.

ROAD: కంకర తేలిన రోడ్డు
Turakavanipally road with gravel

- చాలా ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న గ్రామీణలు

తనకల్లు, నవంబరు2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చిన్నరామన్నగారిపల్లి పంచాయతీ కేంద్రం నుంచి ఆ పంచా యతీలోని తురకవానిపల్లికి దాదాపు 30 యేళ్ల క్రితం నిర్మించిన రోడ్డు చాలా అధ్వానంగా మారింది. కంకర తేలిన రోడ్డు ప్రయాణించేందుకు ఆ గ్రామస్థు లు చాలా అగచాట్లు పడాల్సి వస్తోంది. చిన్నరామన్నపల్లి నుంచి తురకవానిపల్లి వరకు 30 ఏళ్ల క్రితం మూడు కిలో మీటర్ల తారు రోడ్డు నిర్మాణం చేపట్టారు. అందులోనూ సుమారు రెండు కిలోమీ టర్ల దూరం ఆవులచెరువు (సీఆర్‌పల్లి చెరువు) మాత్రమే తారురోడ్డు వేసి, మి గిలిన రోడ్డును వదిలేశారు. ఆ తరువా త ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో తారు రోడ్డు పూర్తిగా దెబ్బతింది. కంక రతేలి చాలా అఽధ్వానంగా మారింది. ఈ రోడ్డుగుండా తురకవానిపల్లికి ప్రయాణం చేయాలంటే ద్విచక్రవాహనదారులు, ఆటో డ్రైవర్లు నరకయాతన పడాల్సి వస్తోంది.


ఇప్పటికే ఎంతోమంది ద్విచక్రవాహనదారులు ప్ర మాదానికి గురయ్యారు. తమ గ్రామానికి ఉన్న రహదారిని బాగు చేయాలని ఎన్ని మార్లు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చి నా, పట్టించుకునే నాథుడే లేడని గ్రామస్థు లు వాపోతున్నారు. తమ గ్రామానికి ర హదారి సరిగా లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. అదేవిధంగా చిన్నరామన్నగారిపల్లి పంచా యతీలోని చిన్నరామన్నగారిపల్లి, గోపిరెడ్డిప ల్లి, గోపిరెడ్డిపల్లిదళితవాడ, తొట్లివారిపల్లి లకు వెళ్లాలంటే రోడ్లు అధ్వానంగా ఉం డడంతో ఇబ్బందులు తప్పడం లేదని ఆ యా గ్రామాల ప్రజలంటున్నారు. అలాగే ఈతోడు నుంచి వెళ్లాలన్నా, ఇటు నల్లచెరు వు మండలం ఎర్రగుట్టపల్లి నుంచి వెళ్లాల న్నా రహదారులు గుంతలమయమై అవస్థలు తప్పడంలేదని తెలుపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిదులు స్పందించి ఈతోడునుంచి తురకవానిపల్లి వరకు, నల్లచెరువు మండలం ఎర్రగుట్టపల్లి నుంచి చిన్నరామన్నగారిపల్లి క్రాస్‌ రోడ్డు వరకు బాగుచేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Nov 02 , 2025 | 11:43 PM