ROAD: కంకర తేలిన రోడ్డు
ABN , Publish Date - Sep 07 , 2025 | 11:20 PM
కంకర తేలిన రోడ్లపై ప్రయా ణం చేయాలంటే నరక ప్రాయగా ఉందని వాహనదారులు వాపోతున్నారు. మండలంలోని కటారుపల్లి నుంచి తుమ్మలబైలు వెళ్లే తారురోడ్డు పూర్తిగా దెబ్బతింది. ఆ దారి పొడవునా కంకర తేలి గుంతలు ఏర్పడ్డాయి. నిత్యం వివిధ పనుల నిమిత్తం తుమ్మలబైలు, పెద్ద తండా, సాదులవాండ్లపల్లి, గొడ్డివెలగల పంచాయతీల ప్రజలు గాండ్లపెంట, కదిరి ప్రాం తాలకు వెళ్తుం టారు. అలాగే ప్రసిద్ధి గాంచిన బోగాదమ్మ దేవతను దర్శించుకోవడానికి నిత్యం భక్తులు పలు వాహనాల్లో వస్తుంటారు.
ప్రయాణం నరకప్రాయం
గాండ్లపెంట, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): కంకర తేలిన రోడ్లపై ప్రయా ణం చేయాలంటే నరక ప్రాయగా ఉందని వాహనదారులు వాపోతున్నారు. మండలంలోని కటారుపల్లి నుంచి తుమ్మలబైలు వెళ్లే తారురోడ్డు పూర్తిగా దెబ్బతింది. ఆ దారి పొడవునా కంకర తేలి గుంతలు ఏర్పడ్డాయి. నిత్యం వివిధ పనుల నిమిత్తం తుమ్మలబైలు, పెద్ద తండా, సాదులవాండ్లపల్లి, గొడ్డివెలగల పంచాయతీల ప్రజలు గాండ్లపెంట, కదిరి ప్రాం తాలకు వెళ్తుం టారు. అలాగే ప్రసిద్ధి గాంచిన బోగాదమ్మ దేవతను దర్శించుకోవడానికి నిత్యం భక్తులు పలు వాహనాల్లో వస్తుంటారు. రహదారి కంకర తేలి, గుం తలు ఏర్పడ డంతో వాహనాలు అదుపు తప్పి, ప్రమాదాలకు గురికావాల్సి వస్తోందని ప్రజలు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నాయకులు కంకర తేలిన రోడ్డుకు మరమ్మతులు చేసి, ప్రమాదాల నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.