ROAD: రోడ్డును ఇరువైపులా కప్పేసిన గడ్డి
ABN , Publish Date - Nov 20 , 2025 | 11:59 PM
మండల పరిధిలోని కమ్మ వారిపల్లి నుంచి పాత బత్తలపల్లి మీదుగా కొండేపాళ్యం వరకు రోడ్డుకు ఇరువైపుల గడ్డి ఏపుగా పెరింది. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు అంటున్నారు. ఏపుగా పె రిగిన గడ్డిని తొలగించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. క మ్మవారిపల్లి నుంచి పాత బత్తలపల్లి, చండ్రాయునిపల్లి, కొండేపాళ్యం మీదుగా కదిరికి వెళ్లే ఈ రహదారి 18 కిలోమీటర్లు ఉంది.
- వాహనదారులకు ఇబ్బందులు
నల్లమాడ, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని కమ్మ వారిపల్లి నుంచి పాత బత్తలపల్లి మీదుగా కొండేపాళ్యం వరకు రోడ్డుకు ఇరువైపుల గడ్డి ఏపుగా పెరింది. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు అంటున్నారు. ఏపుగా పె రిగిన గడ్డిని తొలగించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. క మ్మవారిపల్లి నుంచి పాత బత్తలపల్లి, చండ్రాయునిపల్లి, కొండేపాళ్యం మీదుగా కదిరికి వెళ్లే ఈ రహదారి 18 కిలోమీటర్లు ఉంది. ఈ రహదా రిలో 15 మలుపులున్నాయి. ఇది సింగల్ రోడ్డే. ఈ రోడ్డుకు ఇరు వైపులా గడ్డి, కంపచెట్లు ఏపుగా పెరిగాయి. వాహనాలు ఎదురెదురుగా వస్తే ఏదో ఒక వాహనం గడ్డిలోకి వెళ్లాల్సిందే. లేకపోతే ప్రమాదాలు జరిగే సంఘటనలున్నాయి. ఈ రోడ్డు గుండా కదిరికి నిత్యం ఎనిమిది గ్రామా ల ప్రజలు ప్రయాణిస్తుంటారు. ద్విచక్రవాహనాలు, ఆటోలు, బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. గడ్డి ఏపుగా పెరిగి నందు వల్ల ఈ రోడ్డు మలుపుల్లో ప్రమాదాలు జరిగి పలువురికి కాళ్లు చేతులు విరిగిన సంఘ టనలు అనేకం ఉన్నాయి. రోడ్డుకు ఇరువైపులా పెరిగిన గడ్డిని తొలగిస్తే, కొంతవరకు ప్రమాదాలు అరికట్టడంతో పాటు, వాహ నాల రాకపోకలకు సులువుగా ఉంటుందని ప్రజలు అంటున్నారు. అధి కారులు స్పందించి రోడ్డుకిరువైపులా గడ్డిని తొలగించాలని కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....