TEACHER: ఘనంగా గురుపూజోత్సవం
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:37 AM
మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన జయంతిని పుర స్కరించుకుని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలో గురు పూజోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆపస్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ ఉ పా ధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూల మాల వేసి ఘననివాళులు అర్పించారు.
(ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్)
మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన జయంతిని పుర స్కరించుకుని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలో గురు పూజోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆపస్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ ఉ పా ధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూల మాల వేసి ఘననివాళులు అర్పించారు. సంఘం జిల్లా గౌరవసలహాదారుడు అన్నం అరవింద్ తదితరులు పా ల్గొన్నారు. అలాగే పట్టణంలోని పట్టణంలోని కాకతీయ పాఠశాల, పద్మావతి డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎల్‌పీ సర్కిల్‌లోని పద్మావతి డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వనితావాణి చేతులమీ దుగా కేక్‌కట్ చేయించారు. ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠశాలలో ల యన్సక్లబ్ ఆధ్వర్యంలో లయన్సక్లబ్ వ్యవస్థాపకులు పిట్టా వెంకటస్వామి, అధ్యక్షుడు రమేశబాబు తదితరులు ఉపాఽ ద్యాయులు విశ్వరూప్, గోవింద్, ఓబుళేశు, సుధాకర్‌ను ఘనంగా శాలువాలతో సత్కరించారు. బత్తలపల్లిలోని శ్రీజ్యోతి హైస్కూల్‌లో సర్వేపల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కదిరి పట్టణంలోని షిర్డీ సాయి హైస్కూల్‌లో గురుపూజోత్సవం నిర్వహించారు. అదేవిధంగా తననకల్లు ఎమ్మార్సీలో పలువురు ఉపాధ్యాయులు సర్వేపల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....