JSP: ఘనంగా పవన జన్మదిన వేడుకలు
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:09 AM
జనసేన పార్టీ అధి నేత, డిప్యూటీ సీఎం పవన కల్యాణ్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఘ నంగా నిర్వహించారు. పట్టణంలోని కొత్తపేట వెంకటేశ్వరస్వామి ఆల యలో పూజలు నిర్వహించి, పార్టీ కార్యాలయంలో భారీ కేక్‌కట్ చేశారు.
ధర్మవరం/ తాడిమర్రి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): జనసేన పార్టీ అధి నేత, డిప్యూటీ సీఎం పవన కల్యాణ్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఘ నంగా నిర్వహించారు. పట్టణంలోని కొత్తపేట వెంకటేశ్వరస్వామి ఆల యలో పూజలు నిర్వహించి, పార్టీ కార్యాలయంలో భారీ కేక్‌కట్ చేశారు. ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీచేశారు. పార్టీ నాయకు లు బీసీ మల్లన్న, జూటూరు వెంకీ మిత్రబృందం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసి న రక్తదాన శిబిరానికి ముఖ్యఅతిథిగా హాజరైన చిలకం మఽధుసూదనరెడ్డి రక్తదాతలకు ప్రశంస పత్రాలను అందజేశారు. మధ్యాహ్నం కొత్తపేటలోని షిర్డీసాయి బా బా ఆలయంలో అన్నదానం నిర్వహించారు. జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు అడ్డగిరి శ్యాంకుమార్, మట్టెద్దుల ప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు బెస్త శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అలాగే తాడిమర్రి మండ లంలోని పిన్నదరి గ్రామంలో పార్టీ మండల కన్వీనర్ తదితరుల ఆధ్వ ర్యంలో నిర్వహించిన పవనకళ్యాణ్ జన్మదిన వేడుకలకు చిలకం హాజ ర య్యారు. పారిశుధ్యకార్మికులను సన్మానించి దుస్తులు పంపిణీచేశారు. అలాగే ముదిగుబ్బ, కొత్తచెరువు, నల్లచెరువు, ఓబుళదేవర చెరువు ఆయా మండలాల జనసేన పార్టీ మండల కన్వీనర్ల ఆధ్వర్యంలో కేక్‌కట్ చేసి, పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బుక్కపట్నం భారీ బైకుర్యాలీ నిర్వహించారు. జనసేన యువ నాయకుడు తోట అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో రక్తదానం ఏర్పాటు చేశారు. జనసేన నియోజకవర్గ ఇనచార్జ్ పత్తి చంద్రశేఖర్, నాయకులు దాసరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....