CPI: రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలం
ABN , Publish Date - Sep 09 , 2025 | 12:48 AM
రైతులకు యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైం దని సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్యయాదవ్ పేర్కొన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు అందడంలేంటూ సీపీఐ నాయకులు సోమవారం పట్టణంలోని కాలేజీ సర్కిల్‌లో ఆందోళన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రైతులకు తమ ప్ర భుత్వమే పెద్ద పీట వేస్తుందని చెప్పి, అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారని మండిపడ్డారు.
ఎరువులను అందుబాటులో ఉంచాలి
సీపీఐ నాయకుల డిమాండ్
ఽ(ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్)
రైతులకు యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైం దని సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్యయాదవ్ పేర్కొన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు అందడంలేంటూ సీపీఐ నాయకులు సోమవారం పట్టణంలోని కాలేజీ సర్కిల్‌లో ఆందోళన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రైతులకు తమ ప్ర భుత్వమే పెద్ద పీట వేస్తుందని చెప్పి, అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రైతుల స మస్యలపై దృష్టిసారించి పరిష్కరించాలని కోరారు. ప్రత్యామ్నాయ పంటలకు నాణ్యమైన విత్తనాలు ఉచితం గా అందించాలన్నారు. మోటార్లకు స్మార్టు మీటర్లు బిగించే ప్రక్రియలను రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీ పీఐ నాయకులు పవన, కదిరప్ప, లియాకత, మధు, రమ ణ, శంకరప్ప తదితరులు పాల్గొన్నారు. అలాగే రైతుల స మస్యలను పరిష్కరించాలంటూ సీపీఐ నియోజకవర్గ కా ర్యదర్శి మధు ఆధ్వర్యంలో సోమవారం ధర్మవరంలో ఆ ర్డీఓ మహేశకు వినతిపత్రం అందజేశారు. సీపీఐ నాయ కులు రవికుమార్, రమణ, శ్రీనివాసులు, సకల రాజా త దితరులు పాల్గొన్నారు. అలాగే తాడిమర్రి, ముదిగుబ్బ, గాండ్లపెంట, నంబులపూలకుంట, ఓబుళదేవర చెరువు త దితర మండలకేంద్రాల్లో సీపీఐ ఆయా మండలాల కార్య దర్శుల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్ర మాలు నిర్వహించా రు. స్థానిక తహసీల్దార్‌లకు వినతిపత్రాలు అందజేశారు.