MLA: ప్రజలకు అండగా ప్రభుత్వం : ఎమ్మెల్యే
ABN , Publish Date - Aug 29 , 2025 | 12:31 AM
అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న పేదలకు సీఎంఆర్‌ఎఫ్ అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని 29 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన రూ. 20లక్షలు చెక్కు లను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గురువారం పంపిణీ చేశారు.
కదిరి, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న పేదలకు సీఎంఆర్‌ఎఫ్ అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని 29 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన రూ. 20లక్షలు చెక్కు లను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గురువారం పంపిణీ చేశారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ బంగ్లాలో చెక్కుల పంపిణీ అనంతరం ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి సహాయనిధి ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిరాటకంగా ముఖ్యమంత్రి సహాయనిధి అందిస్తోందన్నారు అలాగే ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్యసేవ పథకాలను ప్రజారోగ్యం కోసం ప్రవేశపెట్టింని ఆయన పేర్కొన్నారు.