MLA : కాశీ యాత్రికులకు సన్మానం అదృష్టం: ఎమ్మెల్యే
ABN , Publish Date - Apr 11 , 2025 | 12:34 AM
రామేశ్వరం నుండి కాశీ వరకు ఆధ్యాత్మిక పాదయాత్ర చేస్తున్న భక్తులను సన్మా నించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి వెం కటేశ్వర ప్రసాద్ అన్నారు. కాశీకి 120 రోజుల సుదీర్ఘ పాదయాత్ర చేప ట్టిన తమిళనాడు భక్తులు ఇటీవల జిల్లాలోకి ప్రవేశించారు. అప్పటి నుంచి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వారికి అవసరమైన భోజనం, వసతి కల్పిస్తున్నారు.

అనంతపురం కల్చరల్, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): రామేశ్వరం నుండి కాశీ వరకు ఆధ్యాత్మిక పాదయాత్ర చేస్తున్న భక్తులను సన్మా నించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి వెం కటేశ్వర ప్రసాద్ అన్నారు. కాశీకి 120 రోజుల సుదీర్ఘ పాదయాత్ర చేప ట్టిన తమిళనాడు భక్తులు ఇటీవల జిల్లాలోకి ప్రవేశించారు. అప్పటి నుంచి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వారికి అవసరమైన భోజనం, వసతి కల్పిస్తున్నారు. గురువారం ఈ బృందం నగరానికి చేరుకుని ఎమ్మెల్యేని కలిసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతోపాటు ఆయన సతీమణి, బంధు వులు, కార్యాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు యాత్రికులను సన్మా నించారు. కార్యక్రమంలో ప్రభుత్వాస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు గంగారామ్, టీడీపీ నాయకులు సింగమనేని రామాంజనేయులు, బో యపాటి రామచంద్ర, దగ్గుపాటి రాజా, వెంకటపతి, లక్ష్మీ నారాయణ రెడ్డి, తెలుగు యువత సాకే లక్ష్మీనరసింహ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....