GOF దుర్గతులను తొలగించే దుర్గాదేవి
ABN , Publish Date - Sep 30 , 2025 | 11:56 PM
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు మంగళవారం భ క్తులు పాహిమాం దుర్గాదేవి అంటూ ప్రార్థించారు. ఇందులో బాగంగా మా మిళ్ళకుంట లలితాపరమేశ్వరి దుర్గామాతగా, ప్రశాంతినిలయంలోని గాయ త్రీమాత, జిల్లా కేంద్రంలోని సత్యమ్మ, వాసవీ కన్యకా పరమేశ్వరి, ఎను మలపల్లి దుర్గమ్మ దుర్గాదేవిగా దర్శనమిచ్చారు.
(ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్ వర్క్)
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు మంగళవారం భ క్తులు పాహిమాం దుర్గాదేవి అంటూ ప్రార్థించారు. ఇందులో బాగంగా మా మిళ్ళకుంట లలితాపరమేశ్వరి దుర్గామాతగా, ప్రశాంతినిలయంలోని గాయ త్రీమాత, జిల్లా కేంద్రంలోని సత్యమ్మ, వాసవీ కన్యకా పరమేశ్వరి, ఎను మలపల్లి దుర్గమ్మ దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. ధర్మవరం పట్టణంలో శ్రీని వానగర్ వెంకటేశ్వరస్వామి శ్రీకృష్ణుడిగా, దుర్గాదేవి అలంకరణలో దుర్గమ్మ, చౌడేశ్వరి, పద్మావతి, వాసవీమాత, పుట మ్మ, గాయత్రీదేవి అమ్మవార్లు భ క్తులకు దర్శనమిచ్చారు. అలాగే గోరకాటి పెద్దమ్మను ప్రత్యేకంగా అలంక రించి పూజలు చేశారు. మండలంలోని ఉప్పునేసినపల్లిలో కొల్హాపురమ్మ ను, గొట్లూరులో మహంకాళమ్మను దుర్గాదేవిగా అలంకరించారు. బత్తల పల్లిలో అమ్మవారు, తాడిమర్రిలో వాసవీ మాత, బుక్కపట్నం చౌడేశ్వరి దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. కదిరి పట్టణంలో కన్యకా పరమేశ్వరి మ హిషాసుర మర్దినిగా, చౌడేశ్వరీ దుర్గాదేవిగా భక్తులను అనుగ్రహించారు.