HOKEY: బాలికల హాకీ జిల్లా జట్టు ఎంపిక
ABN , Publish Date - Jun 06 , 2025 | 12:00 AM
జూనియర్ బాలికల హాకీ జిల్లా జ ట్టును ఎంపిక చేసినట్లు హాకీ అసోసియేషన రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా కార్యదర్శి బంధనాథం సూర్యప్రకాశ, జిల్లా అధ్యక్షుడు బీవీ శ్రీనివాసులు గురువారం ప్రకటించారు. జిల్లా జట్టు ఎంపిక ప్రక్రియను ఈ నెల ఒకటో తేదీన స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠశాల క్రీడామైదానంలో నిర్వ హించినట్లు తెలిపారు.
ధర్మవరం, జూన 5(ఆంధ్రజ్యోతి): జూనియర్ బాలికల హాకీ జిల్లా జ ట్టును ఎంపిక చేసినట్లు హాకీ అసోసియేషన రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా కార్యదర్శి బంధనాథం సూర్యప్రకాశ, జిల్లా అధ్యక్షుడు బీవీ శ్రీనివాసులు గురువారం ప్రకటించారు. జిల్లా జట్టు ఎంపిక ప్రక్రియను ఈ నెల ఒకటో తేదీన స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠశాల క్రీడామైదానంలో నిర్వ హించినట్లు తెలిపారు. జట్టులో సింధు, పవిత్ర, మాధురిబాయ్, వైష్ణవి, హేమ, దివ్య, నసీమా, వర్ష, హర్షిత, నవ్యశ్రీ, దుర్గ, శివగంగా, శ్రీలేఖ, మోక్షిత, గుణశ్రీ, వరలక్ష్మి, ఉషశ్రీ ఉన్నారు. జట్టు కేప్టెనగా సింధు, కోచ, మేనేజర్‌గా మారుతీకుమార్, అరవింగౌడ్ వ్యవహరించనున్నట్టు తెలిపారు. హాకీ ఆంధ్రప్రదేశ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ఈ నెల 8వ తేదీ వరకు భీమవరంలో జరగనున్న 15వ రాష్ట్ర స్థాయి జూనియర్ మహిళల హాకీ పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుందని వారు తెలిపారు. ఎంపికైన జట్టును హాకీ అసోసియేషన జిల్లా అధ్యక్ష, కార్యదర్శులతో పాటు గౌరవాధ్యక్షుడు బండి వేణుగోపాల్, పల్లెం వేణుగోపాల్, ఉపాధ్యక్షుడు ఉడుముల రాము, జిల్లా జాయింట్ సెక్రటరీ అరవిందగౌడ్, జిన్నే చంద్ర, ఉడుముల కిరణ్, అస్లాం, రాఘవేంద్ర, అంజన్న, మారుతీ, అమునుద్దీన, ఇర్షాద్, జిల్లా స్పోర్స్ట్ అథారిటీ కోచ హస్సేన అభినందించారు. అలాగే బీజేపీ నియోజకవర్గ ఇనచార్జ్ హరీశబాబు ఎంపికై మహిళా క్రీడాకారులను స్థానిక ఎన్టీఏ కార్యాలయంలో శాలువ కప్పి ఘనంగా సత్కరించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....