Share News

GARBAGE: ఇళ్ల సమీపంలో చెత్తకుప్ప

ABN , Publish Date - Nov 27 , 2025 | 12:11 AM

స్వచ్ఛత, పరిశుభ్రత అంటూ అధికారులు ఫొటోలకు ఫోజులు ఇస్తారు కానీ ఆచరణ, ఆమలు పట్టించుకోరని ఆ గ్రామ ప్రజలు వాపోతున్నారు. దీంతో గ్రామాల్లో పరిశుభ్రత, చెత్త నుంచి సంపద సృష్టి, తద్వారా పంచాయతీల అభివృద్ధి అనే ప్రభుత్వ లక్ష్యాన్ని పాలకులు, అధికారులు తుంగలో తొ క్కేస్తున్నా రనే విమర్శలు వినవస్తున్నాయి.

GARBAGE: ఇళ్ల సమీపంలో చెత్తకుప్ప
Garbage dumped on Tupalli road

గాండ్లపెంట, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛత, పరిశుభ్రత అంటూ అధికారులు ఫొటోలకు ఫోజులు ఇస్తారు కానీ ఆచరణ, ఆమలు పట్టించుకోరని ఆ గ్రామ ప్రజలు వాపోతున్నారు. దీంతో గ్రామాల్లో పరిశుభ్రత, చెత్త నుంచి సంపద సృష్టి, తద్వారా పంచాయతీల అభివృద్ధి అనే ప్రభుత్వ లక్ష్యాన్ని పాలకులు, అధికారులు తుంగలో తొ క్కేస్తున్నా రనే విమర్శలు వినవస్తున్నాయి. వీధుల్లోని చెత్తను తొలగించేందుకు ప్రభుత్వం ప్రతి పంచా యతీకి పారిశుధ్య కార్మికులను ఏర్పాటు చేసిం ది. అయితే అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పారిశుధ్య కార్మికులు కూడా అంతంత మాత్రంగానే విధులు నిర్వహిస్తున్నారు. వారు వీధుల్లో పేరుకుపోయిన చెత్తను సేకరించి, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రానికి తరలించడం లేదు. ఆ గ్రామానికి సమీపంలోనే వేస్తున్నారు. దీంతో సమీప ప్రాంత వాసులు ఇబ్బందులు పడుతున్నారు.


గాండ్లపెంట మండల కేంద్రంలోనే ఈ సరిస్థితి కనిపిస్తోంది. మండలకేంద్రంలోని ప్రధానరహదారిలో టీ హోటళ్లు, కిరాణా దుకాణాలు, వివిధ షాపుల్లోని చెత్తను పారిశుఽధ్య కార్మికులు సేకరించి చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాని తరలించడం లేదరు. సేకరించిన చెత్తను మలమీదపల్లి, తూ పల్లి రహదారి పొడువునా వేస్తున్నారు. దీంతో చెత్త పేరుకు పోయి రోడ్డు పైకి వస్తోంది. ఆ చెత్త కుప్ప వర్షాలకు కుళ్లి, దుర్వాసన వెదజల్లు తోంది. దీంతో సమీపంలోని నివాస గృహాల వారు ఇబ్బందులకు గుర వుతున్నారు. ఇలాగే వదిలేస్తే రోగాల భారిన పడతామని వారు వా పోతున్నారు. అంతేగాకుండా చెత్త ఉన్న సంచులను కుక్కలు రోడ్డు పైకి లాక్కురావడంతో వాహనదారులకు ఇబ్బందులు కలుగుతు న్నాయని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు పక్కన పేరుకు పోయిన చెత్తన తొలగించాలని కోరుతున్నారు. అదేవి ధంగా గ్రామంలో సేకరించిన చెత్తను గ్రామ సమీపలో పడేయ కుండా చెత్త సంపద కేంద్రానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు, ప్రజలు కోరుతున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Nov 27 , 2025 | 12:11 AM