WATER: రేగాటిపల్లి చెరువులో గంగపూజ
ABN , Publish Date - Nov 22 , 2025 | 11:59 PM
మండలంలోని రేగాటిపల్లి చెరువు హంద్రీనీవా జలాలతో నిండింది. దీంతో శనివారం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి, చా యాదేవి దంపతులు చెరువులో గంగపూజ చేశారు. చెరువు నీటిలోకి చీర, సారే ప సుపు, కుంకుమ వదిలి ప్రత్యేక పూజలు చే శారు.
ధర్మవరం రూరల్, నవంబరు 22 (ఆంరఽధజ్యోతి): మండలంలోని రేగాటిపల్లి చెరువు హంద్రీనీవా జలాలతో నిండింది. దీంతో శనివారం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి, చా యాదేవి దంపతులు చెరువులో గంగపూజ చేశారు. చెరువు నీటిలోకి చీర, సారే ప సుపు, కుంకుమ వదిలి ప్రత్యేక పూజలు చే శారు. రైతుల సంక్షేమ కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్ కట్టుబడి ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
తాగునీటి ప్లాంట్ ప్రారంభం: రేగాటి పల్లి లో ప్రజలకు సురక్షిత మంచి తాగునీరు అందించేందుకు చిలకం మధుసూదనరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని అత్యాధునిక తాగు నీటి ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. దానిని శనివారం చిలకం మధుసూదనరెడ్డి, చా యాదేవి దంపతులు ప్రారంభించారు. ప్రజ లందరికి స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడమే తమ ల క్ష్యమన్నారు. ఈ ప్లాంట్ ద్వారా గ్రామంలో ని ప్రతి ఇంటికి నాణ్యమైన తాగునీరు లభి స్తుందని తద్వారా ప్రజల ఆరోగ్యం, జీవన ప్రమా ణాలు మెరుగుపడతాయని ఆయ న పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో జనసేన నాయకులు పాల్గొన్నారు.