MLA: నియోజకవర్గం అభివృద్ధికి నిధులు
ABN , Publish Date - Sep 30 , 2025 | 12:01 AM
నియోజకవర్గం అభివృద్ధికి నిధు లు మంజూర య్యాయని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపా రు. ఆయన సోమవారం పట్టణంలో ని ఆర్‌అండ్‌డీ బంగ్లాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గడిచిన పదిరోజుల పాటు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసినట్లు తెలిపా రు.
ఎమ్మెల్యే కందికుంట
కదిరి, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గం అభివృద్ధికి నిధు లు మంజూర య్యాయని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపా రు. ఆయన సోమవారం పట్టణంలో ని ఆర్‌అండ్‌డీ బంగ్లాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గడిచిన పదిరోజుల పాటు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసినట్లు తెలిపా రు. ఫలితంగా కదిరిలో మైనార్టీ పాఠశాల, పాలటెక్నిక్ కళాశాలకు రూ. 7కోట్లు మంజూరయ్యాయని, రానున్న విద్యాసంవత్సరానికి ప్రారంభమవు తాయన్నారు. ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు, పరిశీలనలో ఉన్నట్లు తెలి పారు. హంద్రీ నీవా నీటిని అన్ని చెరువులకు అందిస్తామన్నారు. అర్హు లందరికి ఇళ్లు కార్యక్రమంలో తలుపుల మండలవాసులకు ఇళ్లు వచ్చేలా కృషి చేస్తామన్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో తలుపుల, కుటాగుళ్లలో ఆ పార్టీ పాలకులు కొందరు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, వా రిపై చర్యలు తీసుకోవాలని గృహనిర్మాణ శాఖ మంత్రిని కోరినట్లు తెలి పారు. అలాగే అప్పటి జాబితాలో పేర్లు ఉండి, ఇళ్లు మంజూ రుకాని వా రికి న్యాయం చేస్తామన్నారు. వైసీపీ నాయకుడు జగన అసెంబ్లీకి రాకుం డా తనవారిని మండలికి పంపడంలో ఉన్న దురుద్దేశ్యం ఏమిటమని ప్రశ్నించారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మోపూరి శెట్టి చంద్రశేఖర్, పట్టణాధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన, బీసీ నాయకులు కేబీ నాగప్ప తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా స్మార్ట్ రేషనకార్డులను ఎమ్మెల్యే సోమవారం పట్టణంలోని మూడోవార్డులో పంపిణీ చేశారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....