Dagguppati Venkateswara Prasad : అండర్‌గ్రౌండ్ డ్రైనేజీకి నిధులివ్వండి
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:29 AM
నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు ఇవ్వాలని అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో బుధవారం ఆయన మాట్లాడారు. ‘మీ ఇంటికి-మీ ఎమ్మెల్యే’ కార్యక్రమం ద్వారా అనంతపురంలోని కాలనీల్లోకి తాను వెళుతుంటే డ్రైనేజీ సమస్యలు అత్యధికంగా తన దృష్టికి ...

అసెంబ్లీలో ఎమ్మెల్యే దగ్గుపాటి
అనంతపురం, మార్చి 12(ఆంధ్రజ్యోతి): నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు ఇవ్వాలని అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో బుధవారం ఆయన మాట్లాడారు. ‘మీ ఇంటికి-మీ ఎమ్మెల్యే’ కార్యక్రమం ద్వారా అనంతపురంలోని కాలనీల్లోకి తాను వెళుతుంటే డ్రైనేజీ సమస్యలు అత్యధికంగా తన దృష్టికి తెస్తున్నారని అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ద్వారానే ఈ సమ్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. ఇప్పటికే డీపీఆర్ సిద్ధం చేశారని, ఈ బడ్జెట్
నుంచి నిధులు కేటాయించి నిర్మించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. వైసీపీ పాలనలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. అప్పటి అర్బన ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి డమ్మీ మేయర్ వసీంను అడ్డుపెట్టుకొని భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై విచారణ చేసి డబ్బు రికవరీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ బడ్జెట్ నుంచే అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి నిధులు కేటాయించి, సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....