MLA: సూర్యఘర్‌తో ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత
ABN , Publish Date - Oct 19 , 2025 | 12:28 AM
ప్రధానమంత్రి సూర్యఘర్ ఏర్పాటుతో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉచిత విద్యుత సౌకర్యం క ల్పించినట్లు ఎమ్యెల్యే పల్లె సింధూరరెడ్డి, కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని హనుమానకూడలిలో శనివారం సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఎమ్మెల్యే సింధూరరెడ్డి, కలెక్టర్ శ్యాంప్రసాద్
సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్‌పై అవగాహన
పుట్టపర్తి రూరల్/టౌన, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి సూర్యఘర్ ఏర్పాటుతో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉచిత విద్యుత సౌకర్యం క ల్పించినట్లు ఎమ్యెల్యే పల్లె సింధూరరెడ్డి, కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని హనుమానకూడలిలో శనివారం సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ శ్యాం ప్రసాద్‌తో పాటు ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునా థరెడ్డి, విద్యుతశాఖ ఎస్‌ఈ సంపతకుమార్, పరిశ్రమల శాఖ జిల్లా అధి కారి నాగరాజు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే, మాజీ మంత్రి మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం జీఎస్టీ తగ్గించడం వలన సగటున మనిషికి రూ. 20వేల నుంచి రూ. 40వేల వరకు లబ్ధి చేకూరనున్నట్లు తెలిపారు. అదేవిదంగా ప్రధానమంత్రి సూర్యఘర్ సోలార్ యూనిట్ ఏర్పాటుచేసుకుంటే విద్యుతబిల్లుల ఆదా ఆవుతుందన్నారు.
సూర్యఘర్ పథకానికి నియోజకవర్గాన్ని ఒక మోడల్‌గా తీసుకుని సమారు పదివేల సోలార్ యూనిట్లు ఏర్పాటుచేయడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నా రు. అనంతరం హారతి ఘాట్‌వద్ద సూపర్‌జీఎస్టీ - సూపర్ సేవింగ్స్‌లపై ప్రజలకు కలెక్టర్ శ్యాంప్రసాద్ అవగాహన కల్పించారు. అంతకు మునుపు జీఎస్టీ తగ్గింపు వలన వస్తువుల రాయితీ, తదితర వాటిపై ఏర్పాటుచేసిన ఎగ్జిబి షనను ఎమ్యెల్యే, మాజీమంత్రి ఎస్‌ఈ సంపతకుమార్, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, ఈఈ శివరాముడు, ఆర్డీఓ సువర్ణ, మునిసిపల్ కమిషనర్ క్రాంతికుమార్, తహసీల్దార్ కళ్యాణ్ పరిశీలించారు.దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. సదస్సులో టీడీపీ జిలా ్లకార్యదర్శి సామకోటి ఆదినారాయణ, పీఏసీఎస్ అధ్యక్షుడు శ్రీరాంరెడ్డి, ముమ్మనేని వెంకటరాముడు, నాయకులు గంగాధర్‌నాయుడు, సుబ్బచంద్ర, ఓడీసీ మండలకన్వీనర్ జయచంద్ర, మహమ్మద్‌రఫీ, కృష్ణప్ర సాద్, కొత్తచెరువు మార్కెట్ యార్డు చైర్మన పూలశివప్రసాద్, చంద్రశేఖర్, కొత్తపల్లి జయప్రకాష్, షామీర్ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....