Sunitha Comments On Jagan: రాప్తాడుకు జగన్.. పరిటాల సునీత ఏమన్నారంటే
ABN , Publish Date - Apr 07 , 2025 | 03:35 PM
Sunitha Comments On Jagan: చట్టం ఎవరికీ చుట్టం కాదని.. తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే అని ఎమ్మెల్యే పరిటాల సునీత స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో బీసీలపై విచ్చలవిడిగా దాడులకు పాల్పడ్డారని.. అప్పుడు లేని ప్రేమ ఇప్పుడే బీసీలపై జగన్‌కు పుట్టుకొచ్చిందంటూ ధ్వజమెత్తారు.

శ్రీ సత్యసాయి జిల్లా, ఏప్రిల్ 7: రాప్తాడు నియోజకవర్గంలో రేపు (మంగళవారం) మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jagan Mohan Reddy) పర్యటనపై రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత (Raptadu MLA Paritala Sunitha) స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రామగిరి మండలం పాపిరెడ్డి పల్లి గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగి లింగయ్య అనే వ్యక్తి చనిపోతే రాజకీయ హత్యగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధికోసమే మాజీ ముఖ్య మంత్రి జగన్ పాపిరెడ్డిపల్లికి వస్తున్నారని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో కుల రాజకీయాలకు వైసీపీ తెరలేపుతోందని ఆరోపించారు.
చట్టం ఎవరికీ చుట్టం కాదని.. తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే అని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో బీసీలపై విచ్చలవిడిగా దాడులకు పాల్పడ్డారని.. అప్పుడు లేని ప్రేమ ఇప్పుడే బీసీలపై జగన్‌కు పుట్టుకొచ్చిందంటూ ధ్వజమెత్తారు. బీసీ వర్గీయుడైన రామగిరి ఎస్‌ఐ సుధాకర్ యాదవ్‌ను ‘బ్రోకర్’ అంటూ సంబోధించడం వైఎస్ జగన్ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. బీసీ వర్గాలపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు పెడుతున్నారని అన్నారు. వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకోబోమని.. జగన్ పర్యటనలో వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడినా టీడీపీ శ్రేణులు ఎక్కడా సంయమనం కోల్పోవద్దని తెలిపారు.
Mega Health Hub: ఆరోగ్య రంగంలో సంస్కరణలు.. చంద్రబాబు విజన్ ఇదే
జగన్‌ను రాకుండా ఆపే దమ్ము ధైర్యం రెండూ ఉన్నాయన్నారు. తమలో ఉన్నది టీడీపీ, చంద్రబాబు, పరిటాల బ్లడ్ అని చెప్పుకొచ్చారు. ఎక్కిన హెలికాప్టర్‌ను దిగకుండా తిరిగి పంపే శక్తి ఉందన్నారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు అదే కోరుతున్నారని.. కానీ చంద్రబాబు ఇలాంటి సంస్కృతి నేర్పలేదని తెలిపారు. గతంలో పరిటాల రవి పులివెందులకు వెళ్లినప్పుడు మీరు అడ్డుకున్నారని.. వాహనాలు తనిఖీ చేసి.. మూడు వాహనాలకే అనుమతి ఇచ్చారని గుర్తుచేశారు. ఒక చావును రాజకీయం చేయడానికి జగన్ రెడ్డి వస్తున్నారని విమర్శించారు. ఇక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా బాధిత కుటుంబానికి సాయం చేయాలని జగన్‌కు హితవుపలికారు. ప్రకాష్ రెడ్డి చెప్పిన మాటలు విని జగన్ వస్తున్నారని… అసలు ఇక్కడ ఏం జరిగిందో కూడా జగన్‌కు తెలియదని అన్నారు.బీసీల మీద అంత ప్రేమ ఉంటే.. రాప్తాడు ఇన్‌ఛార్జి బీసీకి ఇవ్వాలని ఎమ్మెల్యే పరిటాల సునీత డిమాండ్ చేశారు.
రేపు రాప్తాడుకు జగన్
కాగా.. మాజీ సీఎం జగన్ రేపు రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రామగిరి మండలం పాపిరెడ్డి పల్లి లో ఇటీవల హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో రాప్తాడుకు రానున్నారు. ఈ క్రమంలో కుంటిమద్ది గ్రామం సమీపంలో హెలిపాడ్ ఏర్పాటు చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన పాపిరెడ్డిపల్లికి చేరుకుని లింమయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు.
ఇవి కూడా చదవండి
Prabhavati Investigation: విచారణకు వచ్చిన ప్రభావతి.. కానీ
YS Sharmila Criticizes AP Govt: నిలిచిన వైద్య సేవలు.. సర్కార్‌పై షర్మిల ఫైర్
Read Latest AP News And Telugu News