MINISTER: ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి
ABN , Publish Date - Sep 29 , 2025 | 11:54 PM
ప్రజాసమస్యల పరి ష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఎన్డీఏ కార్యాలయంలో సోమవారం సాయంత్రం వివిధ శాఖల అధికా రులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
అధికారులకు మంత్రి సత్యకుమార్ ఆదేశం
ధర్మవరం, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): ప్రజాసమస్యల పరి ష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఎన్డీఏ కార్యాలయంలో సోమవారం సాయంత్రం వివిధ శాఖల అధికా రులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావే శంలో రూరల్ వాటర్ సప్లై, శానిటేషన, జల్‌జీవనమిషన, విద్యుత, మైనింగ్, ఇరిగేషన, హౌసింగ్ తదితరశాఖల అధికారులు పాలొ ్గన్నారు. ప్రజలకు అత్యంత ప్రాధాన్యత కలిగిన పథకాలను వేగవం తంగా అమలు చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వం తీసుకు న్న అసంబద్ధ నిర్ణయాల కారణంగా ధర్మవరం ప్రజలు ఎన్నో ఇ బ్బందులను ఎదుర్కొన్నారన్నారు. ముఖ్యంగా గృహ నిర్మాణాలలో ప్రజల కలలను జగన ప్రభుత్వం నాశనం చేసిందని విమర్శిం చారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో జరుగుతున్న అ భివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో మంత్రి సమీక్షించారు. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా 102 మంది లబ్ధిదారులకు రూ.67లక్షల విలువ చేసే సీఎంఆర్‌ఎఫ్ చె క్కులను మంత్రి సోమవారం స్థానిక ఎన్డీఏ కార్యాలయంలో పంపిణీచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధను గుర్తుచేశారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....