MLA: ప్రజల సమస్యలపై దృష్టి సారించండి
ABN , Publish Date - Nov 06 , 2025 | 11:40 PM
గ్రామీణప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి అధికారులకు సూచించారు. పుట్టపర్తి మండల పరిషతకార్యాలయంలో గురువారం ఎంపీపీ రమణారె డ్డి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రైతులు పండించిన పంటలకు సరైన మార్కెట్ సౌకర్యంలేక నష్టపోతున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.
- మండల సమావేశంలో ఎమ్మెల్యే సింధూరరెడ్డి
పుట్టపర్తి రూరల్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): గ్రామీణప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి అధికారులకు సూచించారు. పుట్టపర్తి మండల పరిషతకార్యాలయంలో గురువారం ఎంపీపీ రమణారె డ్డి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రైతులు పండించిన పంటలకు సరైన మార్కెట్ సౌకర్యంలేక నష్టపోతున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక, పట్టుపరిశ్రమలు, గ్రామీణ అభివృద్ధి శాఖల అదికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు మార్కెట్ సౌకర్యం కల్పించాలని సూచించారు. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం, వాణిజ్య పంటల సాగుపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచిం చారు. ప్రభుత్వం రైతులకు అందించే సంక్షే మ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ప్రజాప్రతినిధులు, అధి కారులపై ఉందన్నారు. పట్టుపురుగుల పెం పకం నియోజకవర్గంలో తక్కువగా ఉందని, దాన్ని ప్రోత్సహించాలని కోరారు. గ్రా మైక్య సంఘాల ద్వారా రైతుల ఉత్పత్తులను మార్కెటింగ్ చేసి పుట్టపర్తి బ్రాండ్‌గా అభి వృద్ధి చేయాలని సూచించారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరిం చడంలో అధికారులు చొరవచూపాలని ఎమ్యెల్యే ఆదేశించారు. కార్యక్ర మంలో ఎంపీడీఓ నాగేశ్వర్‌రెడ్డి, సర్పంచులు చిన్నపెద్దన్న, శ్రీనివాసులు, లక్ష్మిదేవి, జగరాజుపల్లి ఎంపీటీసీ మధురిమ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....