Share News

MLA: శాంతిభద్రతలపై దృష్టి పెట్టండి

ABN , Publish Date - Oct 05 , 2025 | 01:00 AM

జిల్లాలో శాంతిభద్ర తలకు పెద్ద పీట వేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి ఎస్పీ సతీష్‌ కుమార్‌ను కోరారు. వారు శనివారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎస్పీని మర్యాద పూర్వ కంగా కలశారు. పుష్పగుచ్ఛం అందజేసి పట్టుశాలువాతో ఘనంగా సన్మానించారు.

MLA:  శాంతిభద్రతలపై దృష్టి పెట్టండి
MLA, ex-minister honoring SP

బాబా శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం

ఎస్పీని కలిసిన ఎమ్మెల్యే సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె

పుట్టపర్తి రూరల్‌, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో శాంతిభద్ర తలకు పెద్ద పీట వేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి ఎస్పీ సతీష్‌ కుమార్‌ను కోరారు. వారు శనివారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎస్పీని మర్యాద పూర్వ కంగా కలశారు. పుష్పగుచ్ఛం అందజేసి పట్టుశాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా వారు ఎస్పీతో మాట్లాడుతూ... జిల్లాలో ముఖ్యంగా నియో జకవర్గంలో శాంతిభ ద్రతలకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అదే విదంగా వచ్చే నవంబరు నెలలో సత్యసాయి జయంతి వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిద్దామన్నారు. నియోజకవర్గంలో ఖా ళీగా ఉన్న ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టులను తక్షణం భర్తీచేయాలని కోరారు. నియోజకవర్గంలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు, చోరీలు జరుగకుండా పల్లెల్లో ప్రశాంత వాతావరణం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా పేకాట, రౌడీయిజం గంజాయి వంటి వాటిపై ప్రత్యేక నిఘా ఉంచి వాటిని పూర్తిగా అరికట్టాలని వారు ఎస్పీని కోరారు. ఎస్పీని కలిసిన వారిలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్‌ పత్తి చంద్రశేఖర్‌, కొత్తచెరువు మార్కెట్‌యార్డు చైర్మన పూల శివప్రసాద్‌, కూటమి నాయకులు, కన్వీనర్లు ఉన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Oct 05 , 2025 | 01:00 AM