FORMER MINISTER: పోరాటయోధుడు గౌతు లచ్చన్న: పల్లె
ABN , Publish Date - Aug 17 , 2025 | 12:44 AM
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు గౌతు లచ్చన్న బడుగు బలహీన వర్గాల కోసం అనేక పోరాటాలు చేశారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన గౌతు లచ్చన్న జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. లచ్చన్న సాహసానికి, కార్య దీక్షతకు మెచ్చి ప్రజలే సర్దార్ అనే బిరుదును ఆయనకిచ్చారని గుర్తు చేశారు.
పుట్టపర్తి టౌన, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు గౌతు లచ్చన్న బడుగు బలహీన వర్గాల కోసం అనేక పోరాటాలు చేశారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన గౌతు లచ్చన్న జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. లచ్చన్న సాహసానికి, కార్య దీక్షతకు మెచ్చి ప్రజలే సర్దార్ అనే బిరుదును ఆయనకిచ్చారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు పీసీ గం గన్న, బెస్త చలపతి, నాయకులు గంగాధర్‌నాయుడు, శ్రీరాములు, శ్రీరామిరెడ్డి, ఓబులేసు, రమేష్, సూరి పాల్గొన్నారు.
ఈడిగ సాధికార సమితి నాయకుల హర్షం
కదిరి అర్బన, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): బడుగు, బలహీనవ ర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని అధికారికంగా నిర్వహించడంపై ఈడిగ సాధికారిక సమితి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. వారు శనివారం పట్టణంలో సమావేశం నిర్వహిం చి మాట్లాడారు. ఆయన జయం తిని అఽధికా రికంగా నిర్వహించడంతో సీఎం చంద్రబాబుకు కృతజ్ఞ తలు తెలి పారు. నాయకులు మనోహర్‌గౌడ్, నాగేంద్రగౌడ్, రామాంజిగౌడ్, సరోజమ్మ, శంకరప్పగౌడ్, బాబుగౌడ్ తదితరులు ఉన్నారు.