FESTIVAL: పట్టణాల్లో పండుగ సందడి
ABN , Publish Date - Aug 26 , 2025 | 11:53 PM
వినాయకచవితి పండుగను పురస్కరించుకుని పట్టణాల్లో వ్యాపారులు, కొనుగో లు దారుల సందడి నెలకొంది. ధర్మవరం పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్‌లో మంగళవారం జనంతో కిటకిటలాడింది. వినాయక ప్రతి మలు, పూజా సామగ్రి కోనుగోలు చేసేందుకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు తరలి రావడంతో ఎన్టీఆర్ సర్కిల్ కిక్కరిసిపోయింది.
ధర్మవరం రూరల్/ కదిరి/ కొత్తచెరువు, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): వినాయకచవితి పండుగను పురస్కరించుకుని పట్టణాల్లో వ్యాపారులు, కొనుగో లు దారుల సందడి నెలకొంది. ధర్మవరం పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్‌లో మంగళవారం జనంతో కిటకిటలాడింది. వినాయక ప్రతి మలు, పూజా సామగ్రి కోనుగోలు చేసేందుకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు తరలి రావడంతో ఎన్టీఆర్ సర్కిల్ కిక్కరిసిపోయింది. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి అంజుమనసర్కిల్ వరకు తోపుడు బండ్ల వ్యాపారులు, జనంతో ఆ ప్రాం తం కిటకిటలాడింది. కదిరి పట్టణంలోని కాలేజీ సర్కిల్, బస్టాండ్ కూడలి, జీవిమానుసర్కిల్, టవర్‌క్లాక్ తదితర కూడళ్లలో జనంతో సందడి నెలకొం ది. ఎటు చూసినా కొనుగోలుదారులతో పట్టణం కిటకిటలాడింది. ద్విచ క్రవాహనదారులు వెళ్లడానికి ఇబ్బందులు పడ్డారు. మండల కేంద్ర మైన కొత్తచెరువులో నాలుగురోడ్ల కూడలిలో బుక్కపట్నం రహదారి జనంతో కిక్కిరిసి పోయింది. పట్టణం, గ్రామాలలో నెలకొల్పే వినాయక విగ్రహాలను కోనుగోలు చేసి ట్రాక్టర్లు, ప్రత్యేక వాహనాలు, ఎద్దులబండ్లలో తీసుకెళ్లారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....