ICDS: ఆడ బిడ్డలే... అవనికి వెలుగులు
ABN , Publish Date - Oct 08 , 2025 | 11:53 PM
ఆడబిడ్డలే అవనికి వెలుగులని నల్లచెరువు ఐసీడీఎస్ సీడీపీఓ వెంకట లక్ష్మమ్మ పేర్కొ న్నారు. మండలంలోని రాజువారిపల్లి సమీపంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలి కా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
- బాలికా దినోత్సవంలో సీడీపీఓ
తనకల్లు, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): ఆడబిడ్డలే అవనికి వెలుగులని నల్లచెరువు ఐసీడీఎస్ సీడీపీఓ వెంకట లక్ష్మమ్మ పేర్కొ న్నారు. మండలంలోని రాజువారిపల్లి సమీపంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలి కా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ సెప్టెంబరు నెలలో జ న్మించిన ప్రతి ఆడబిడ్డ పేరు మీద ఒక మొక్క నాటి సంరక్షించా లని కోరారు. ఆడపిల్లలు అన్ని రంగాలలో రాణించాలని సూచిం చారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర ప థకాల ప్రాముఖ్యాన్ని వివరించారు. అనంతరం వ్యాసరచన పోటీ లు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ర్యాలీ నిర్వహించిన అనంతరం పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో పాఠశాల ఎస్‌ఓ అమీ దా, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ లక్ష్మీదేవమ్మ, అంగనవాడీ కార్యకర్త లు, ఆయాలు, కేజీబీవీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....