MLA: రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Dec 02 , 2025 | 12:07 AM
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పల్లె సిఽంధూరరెడ్డి అన్నారు. చినగానిపల్లిలో సోమ వారం నిర్వహించిన ‘రైతన్నా.. మీ కోసం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే ము ఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే మండలంలోని మహమ్మదాబాద్ ఎస్సీ కాలనీ, కసముద్రం, సోలుకుంట్ల, బలకవారిపల్లి, అమడగూరు, చినగానిపల్లి పంచాయతీలో ఎనటిఆర్ భరోసా సామాజిక పింఛన్లను లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి
అమడగూరు, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పల్లె సిఽంధూరరెడ్డి అన్నారు. చినగానిపల్లిలో సోమ వారం నిర్వహించిన ‘రైతన్నా.. మీ కోసం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే ము ఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే మండలంలోని మహమ్మదాబాద్ ఎస్సీ కాలనీ, కసముద్రం, సోలుకుంట్ల, బలకవారిపల్లి, అమడగూరు, చినగానిపల్లి పంచాయతీలో ఎనటిఆర్ భరోసా సామాజిక పింఛన్లను లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేశారు. ఆయా గ్రామాల్లో తన దృష్టికి వచ్చిన నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికా రులను ఆదేశించారు. అలాగే చినగానిపల్లి పంచాయతీలోని గ్రామా ల అభివృద్దిపై స్థానిక గ్రామ సచివాలయంలో పంచాయతీ, మండల అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మునెప్ప, స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ మండల కన్వీనర్ గోపాల్‌రెడ్డి, బీజేపీ నాయకులు శరత కుమార్‌రెడ్డి, మహమ్మదాబాద్ సొసైటీ చైర్మన కమ్మల నరేష్, నాయకులు వల్లెపు సోమశేఖర్ , శెట్టివారి జయచంద్ర తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....