FAPTO: బోధనేతర విధుల బహిష్కరణ : ఫ్యాప్టో
ABN , Publish Date - Oct 11 , 2025 | 12:29 AM
రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శుక్రవారం నుంచి మండలంలో అన్ని పాఠశాలల్లో బోధనేతర పనులను బహిష్కరిస్తున్నట్లు ఫ్యాప్టో జిల్లా కార్యదర్శి గౌసులాజం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం మండల విద్యాశాఖాధికారులు సురేష్ బాబు, రమణకు వినతిపత్రం సమర్పించారు.
ఓబుళదేవరచెరువు, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శుక్రవారం నుంచి మండలంలో అన్ని పాఠశాలల్లో బోధనేతర పనులను బహిష్కరిస్తున్నట్లు ఫ్యాప్టో జిల్లా కార్యదర్శి గౌసులాజం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం మండల విద్యాశాఖాధికారులు సురేష్ బాబు, రమణకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉపాధ్యాయులు శుక్రవారం నుంచి పాఠశాలల్లో కేవలం ఉపాధ్యాయుల హాజరు, పిల్లల హాజరు, మధ్యాహ్న భోజనం పనులు మాత్రమే చేస్తారని తెలిపారు. మిగిలిన బోధనేతర పనులన్నీ బహిష్కరి స్తున్నామన్నారు. ఫ్యాప్టో నాయకులు సోమశేఖర్ నాయక్, రామ్‌కుమార్, మనోహర్, మధుసూదనరెడ్డి, వెంకట చలమయ్య, శ్రీనివాసులు, మహేందర్ రెడ్డి, చంద్రమౌళి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....