AC: పదో తరగతి పరీక్షా కేంద్రాల పరిశీలన
ABN , Publish Date - Oct 29 , 2025 | 11:47 PM
వచ్చే ఏడాది 2025-26 సంవత్సరంలో నిర్వహించనున్న పదో తరగతి పరీక్ష కేంద్రాలను అసిస్టెంట్ కమిషనర్ లాజర్ బుధవారం పరిశీలించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో వచ్చే ఏడాది నిర్వహించే పదో తగరతి పరీక్షా కేంద్రంలో వసతులు, గదులు, బల్లలు, ఫ్యానలు, మంచి నీటి సౌకర్యంపై ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో ఆరా తీశారు.
గాండ్లపెంట, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది 2025-26 సంవత్సరంలో నిర్వహించనున్న పదో తరగతి పరీక్ష కేంద్రాలను అసిస్టెంట్ కమిషనర్ లాజర్ బుధవారం పరిశీలించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో వచ్చే ఏడాది నిర్వహించే పదో తగరతి పరీక్షా కేంద్రంలో వసతులు, గదులు, బల్లలు, ఫ్యానలు, మంచి నీటి సౌకర్యంపై ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో ఆరా తీశారు. అలాగే పరీక్ష రాసే విద్యార్థులుకు అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ జానరెడ్డెప్ప, ఎంఈఓ కృష్ణానాయక్, ప్రధానోపాధ్యాయుడు ప్రసాద్ పాల్గొన్నారు.
తనకల్లు: మండల పరిధిలోని రాచువారిపల్లి సమీపంలో ఉన్న కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయాన్ని బుధవారం రాష్ట్ర అసిస్టెంట్ కమిషనర్ లాజర్, పెనుగొండ డీవైఈఓ జానరెడ్డెప్ప, ఎంఈఓ కళ్యాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి పరీక్షల నిర్వాహణ కోసం సెంటర్‌ను పరిశీలించారు. వసతులను పరిశీలిం చారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హమీదాబీ, సిబ్బంది పాల్గొన్నారు.