Independence Day : స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:52 AM
స్వాతంత్య్ర దినోత్సవాలను పండుగలా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామని ఇనచార్జి కలెక్టర్ శివనారాయణ శర్మ తెలిపారు. నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాట్లను....
ఇనచార్జి కలెక్టర్ శివనారాయణ శర్మ
అనంతపురం కలెక్టరేట్, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవాలను పండుగలా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామని ఇనచార్జి కలెక్టర్ శివనారాయణ శర్మ తెలిపారు. నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాట్లను అసిస్టెంట్ కలెక్టర్ సచిన రహార్, ఆర్డీఓ కేశవనాయుడుతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. వేడుకలలో రాషీ్ట్రయ సెల్యూట్ సమర్పణ, పరేడ్ సందర్శన, మార్చ్‌ఫాస్ట్, శకటాల ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ తదితర కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.