CELEBRATIONS: గణేశ ఉత్సవాలకు సర్వ సిద్ధం
ABN , Publish Date - Aug 26 , 2025 | 11:49 PM
జిల్లా వ్యాప్తంగా గణేశ ఉత్సవాలను నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లుచేపట్టారు. బుధవారం గణేశ విగ్రహాలు ఏర్పాటుచేయాల్సి ఉండగా మంగళవారమే విగ్రహాలను ఆయా ప్రాంతాలకు చేర్చారు. జిల్లా కేంద్రంతో పాటు హిందూపురం, ధర్మవరం, కదిరి కేంద్రాలలో భారీ విగ్రహాలను నిలబెట్టడానికి ఒకరోజు ముందే వినాయక ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు చేస్తున్నారు.
వాడవాడలా భారీ విగ్రహాల ఏర్పాటుకు సన్నాహాలు
పుట్టపర్తి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా గణేశ ఉత్సవాలను నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లుచేపట్టారు. బుధవారం గణేశ విగ్రహాలు ఏర్పాటుచేయాల్సి ఉండగా మంగళవారమే విగ్రహాలను ఆయా ప్రాంతాలకు చేర్చారు. జిల్లా కేంద్రంతో పాటు హిందూపురం, ధర్మవరం, కదిరి కేంద్రాలలో భారీ విగ్రహాలను నిలబెట్టడానికి ఒకరోజు ముందే వినాయక ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు చేస్తున్నారు. వినాయక పూజల్లో ఉపయోగిం చడానికి చిన్న విగ్రహా లతో పాటు పూజా సామగ్రి, పూలు, కాయలు, పండ్లు పెద్దఎత్తున కొనుగోలు చేశారు. బుధవారం ఉదయం 7గంటలకే గణేశ చతుర్థి సందర్భంగా ఉత్సవ విగ్రహాలను నిలబెట్టి పూజలు చేయనున్నారు. విగ్రహాలు ఏర్పాటుచేసిన వీధీలలో భారీ ఎత్తున స్వాగత తోరణాలు, విద్యుత దీపాలంకరణ చేపట్టారు. వినాయక చవితి పండుగ జరుపుకోవడానికి ఇతర ప్రాంతాలలో ఉన్న ఉద్యోగులు, వలసలు వెళ్లిన వారు స్వగ్రామాలకు చేరుకున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....