Share News

MLA: ప్రతి మహిళ ఆర్థికవేత్త కావాలి

ABN , Publish Date - Sep 01 , 2025 | 11:49 PM

రాష్ట్రంలోని ప్రతి నిరుపేద మహిళను ఆర్థికవేత్తగా మార్చాలన్నదే ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు ఆశయమని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సోమవారం జిల్లా కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం నుంచి ఏపీజే అబ్దుల్‌కలాం షాదీమహల్‌ వరకు 900 మంది మహిళలతో కలసి ‘సూ పర్‌సిక్స్‌ సూపర్‌హిట్‌’ భారీ ర్యాలీ నిర్వహించారు.

MLA:  ప్రతి మహిళ ఆర్థికవేత్త కావాలి
MLA, ex-minister and others conducting the rally

ఇదే సీఎం ఆశయం : ఎమ్మెల్యే సింధూరరెడ్డి

పుట్టపర్తి రూరల్‌, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రతి నిరుపేద మహిళను ఆర్థికవేత్తగా మార్చాలన్నదే ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు ఆశయమని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సోమవారం జిల్లా కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం నుంచి ఏపీజే అబ్దుల్‌కలాం షాదీమహల్‌ వరకు 900 మంది మహిళలతో కలసి ‘సూ పర్‌సిక్స్‌ సూపర్‌హిట్‌’ భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి సోమవారానికి 30 ఏళ్లు పూర్తైన సంద ర్భంగా కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం సమావే శంలో వారు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఏకార్యక్రమం చేపట్టినా మహిళకు గుర్తింపు తెచ్చేందుకే అన్నారు. గతంలోనూ మాజీ ముఖ్యమం త్రి ఎన్టీరామారావు హయాంలో స్త్రీలకు ఆస్తిలో హక్కు, 33 శాతం రి జర్వేషన్లు వంటి కార్యక్రమాలను తెచ్చిన ఘనత టీడీపీకే దక్కుతుం దన్నారు.


ఆదేబాటలో నడుస్తూ సీఎం చంద్రబాబు మహిళాశక్తిని ప్ర పంచానికి చాటారన్నారు. అనంతరం నియోజకవర్గానికి సంబంధించి మ హిళా సంఘాలకు డీఆర్డీఏ వెలుగుశాఖ ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిన రూ 84.24 కోట్ల బ్యాంకు లింకేజీ స్త్రీనిధి సొమ్ము చెక్‌ను వారి చేతుల మీదుగా పీడీ నరసయ్య అందజేశారు. ఆర్డీఓ సువర్ణ, ఆర్టీసీ డీ ఎం ఇనయతుల్లా, డీపీఎం పద్మావతి, అరుణ, ఏపీఎం పద్మావతి, మెప్మా సీఎంఎం రమాదేవి, టీడీపీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, టీడీపీ పట్టణ, మండల కన్వీనర్లు విజయ్‌కుమార్‌, రామాంజినేయులు, రామకృష్ణ, ఒలిపి శ్రీనావాసులు, మల్లిరెడ్డి, పీఏసీసీఎస్‌ అధ్యక్షుడు శ్రీరా మరెడ్డి, నాయకులు సాలక్కగారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

పింఛన్ల పంపిణీ

కొత్తచెరువు: ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి సోమవారం మం డలంలోని కొడపగానిపల్లి, తలమర్ల, మీర్జాపురం, కొత్తచెరువులో ఎన్టీఆర్‌ భరోసా పింఛనలను వారి ఇళ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Sep 01 , 2025 | 11:49 PM