Share News

OFFICER: ప్రతి ఇంటా ఓ మొక్క నాటాలి

ABN , Publish Date - Sep 25 , 2025 | 11:57 PM

ఇంటి పరిసరాలను పరిశు భ్రంగా ఉంచుకోవడంతో పాటు ప్రతి ఇంటి వద్ద ఓ మొక్కను నాటుకోవాలని జిల్లా పరిషత డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య సూచించారు. అలాచేస్తే మన ఆరోగ్యం మ న చేతుల్లోనే ఉంటుందన్నారు. మండల కేం ద్రంలో గురువారం నిర్వహించిన స్వచ్ఛతా హి సేవా కార్యక్రమానికి ఆయన ముఖ్య అ తిథిగా హాజరె మాట్లాడారు .

OFFICER: ప్రతి ఇంటా ఓ మొక్క నాటాలి
A scene honoring workers at Nambulapulakunta

స్వచ్ఛతాహి సేవలోఅధికారులు

నంబులపూలకుంట, సెప్టెంబరు25 (ఆంధ్రజ్యోతి): ఇంటి పరిసరాలను పరిశు భ్రంగా ఉంచుకోవడంతో పాటు ప్రతి ఇంటి వద్ద ఓ మొక్కను నాటుకోవాలని జిల్లా పరిషత డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య సూచించారు. అలాచేస్తే మన ఆరోగ్యం మ న చేతుల్లోనే ఉంటుందన్నారు. మండల కేం ద్రంలో గురువారం నిర్వహించిన స్వచ్ఛతా హి సేవా కార్యక్రమానికి ఆయన ముఖ్య అ తిథిగా హాజరె మాట్లాడారు. అనంతరం మొ క్కలు నాటారు. కార్మికులను దుశ్శాలువాలు, పూలమాలలతో సన్మానించా రు. ఎంపీడీఓ పార్థసారఽథి, నాయకులు దండే రవిశంకర్‌, రామమోహన, బాబ్‌జాన, ఈఓఆర్డీ మాధవరెడ్డి, పంచాయతీ కార్యదర్శి రమేష్‌, ఏపీఎం వెంకటనారాయణ, ఈసీ శ్రీధ ర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఓబుళదేవరచెరువు/గాండ్లపెంట: ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఎంపీడీఓ శివరామ ప్రసాద్‌రెడ్డి, వెలుగు ఏరియా కోఆర్డినేటర్‌ కె. రవీంద్ర పిలుపునిచ్చారు. స్థానిక పల్లవీ మండల సమాఖ్య వెలుగు కార్యాలయం ఆవరణంలో గురు వారం స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాన్ని నిర్వహించి, మొక్కలు నాటారు. అలాగే ఎంపీపీ సోమశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో గాండ్లపెంటలో స్వచ్ఛతాహి సేవ కా ర్యక్రమం నిర్వహించారు. ఎంపీడీఓ సునీత, సర్పంచ రహంతుల్లా, పలు శాఖల అధికారులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

ధర్మవరం రూరల్‌: మండలంలోని పోతుకుంట గ్రామంలో గురు వారం స్వచ్ఛతాహి సేవ నిర్వహించారు. డీడీఓ జనార్దనరావు, ఎంపీడీఓ సాయిమనోహర్‌, డిప్యూటీ ఎంపీడీఓ ఏలూరి వెంకటేష్‌ హాజరై గ్రామ పరిసరాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి శ్రమదానం చేశారు. అనంతరం గ్రీనఅంబాసిడర్లను సన్మానించారు. అదేవిధంగా దీనదయాళ్‌ ఉపాధ్యాయ జయంతి వేడుకలను జరుపుకున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Sep 25 , 2025 | 11:57 PM