Share News

SCHOOL: నిధులున్నా... సౌకర్యాలు సున్నా

ABN , Publish Date - Aug 20 , 2025 | 12:25 AM

‘నాడు - నేడు’ పథకం కింద ఎంపికైన కొన్ని ప్రభుత్వ పాఠ శాలల్లో చేపట్టే పనులకు నిధులున్నా, నేటికీ సౌకర్యాలు కల్పించడం లేదు. మండల వ్యాప్తంగా 58 ప్రభుత్వ పా ఠశాలలు ఉన్నాయి. 46 ప్రాథమిక, ఏడో ప్రాథమికోన్న త, నాలుగు జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలు, కేజీబీ వీ ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మా ర్చి కార్పొరేటు పాఠశాలలకు దీటు గా తీర్చిదిద్దుతామని చెప్పిన గత వైసీపీ ప్రభుత్వం సకాలంలో నిధులు ఇ వ్వకపోవడంలో పనులు అర్థాంతరంగా ఆగిపోయాయి.

SCHOOL: నిధులున్నా... సౌకర్యాలు సున్నా
NP Kunta Primary School bounded by stucco walls

పాఠశాలల్లో అర్ధాంతరంగా ఆగిన ‘నాడు- నేడు’ పనులు

ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు

నంబులపూలకుంట, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ‘నాడు - నేడు’ పథకం కింద ఎంపికైన కొన్ని ప్రభుత్వ పాఠ శాలల్లో చేపట్టే పనులకు నిధులున్నా, నేటికీ సౌకర్యాలు కల్పించడం లేదు. మండల వ్యాప్తంగా 58 ప్రభుత్వ పా ఠశాలలు ఉన్నాయి. 46 ప్రాథమిక, ఏడో ప్రాథమికోన్న త, నాలుగు జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలు, కేజీబీ వీ ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మా ర్చి కార్పొరేటు పాఠశాలలకు దీటు గా తీర్చిదిద్దుతామని చెప్పిన గత వైసీపీ ప్రభుత్వం సకాలంలో నిధులు ఇ వ్వకపోవడంలో పనులు అర్థాంతరంగా ఆగిపోయాయి. ‘నాడు - నేడు’ మొదటి విడతలో ఏడు పాఠశాలలు, రెండో విడతలో 21 పాఠశాలలకు నిధులు మంజూరు చేశారు. ఎస్‌ఎంసీ తీర్మానంతోనే పనులు ప్రారంభించా రు. ఇందులో పూర్తి శిథిలావస్థకు చేరుకున్న మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల (మెయిన) భవనాన్ని తొల గించారు. ఆ స్థలంలోనే నూతన భవనం నిర్మాణం చేపట్టకుండా, ప్రభుత్వ స్థలంలో నిర్మించాలని ఆలస్యం చేశారు. ఈ పాఠశాలను యేడాదికి పైగా ఓ అద్దె భవనంలో కొనసాగించారు. ప్రభుత్వం నుంచి అద్దెలు రాకపోవడంతో, ఉపాధ్యాయులే చెల్లించాల్సి వచ్చింది. అయతే ఎస్‌ఎంసీ తీర్మానం మేరకు తొలగించిన భవనం స్థానంలోనే కొత్త నిర్మాణం ప్రారంభించినా పూ ర్తి కాలేదు. ప్రస్తుతం పాఠశాలలోని గ్రంథాలయ భవ నంలోనే నేటికీ పాఠశాల కొనసాగుతోంది. నూతన భవన నిర్మాణం మొండిగోడలకే పరిమితమైంది. పనుల కోసం కొనుగోలు చేసిన కంకర, కడ్డీలు ఆరుబయటే దర్శనమిస్తున్నాయి. ఇప్పటికీ ఆ పాఠశాలకు సంబం ధించి రూ.6.02లక్షల నిధులు ఉన్నాయి. అలాగే ధని యానచెరువు జిల్లాపరిషత ఉన్నత పాఠశాలకు రూ. 13 లక్షలు, నల్లచెరువు మండలంలోని కుమ్మరవాండ్లపల్లి ప్రాథమిక పాఠశాల వంటగదికి మంజూరైన రూ. 5 లక్షలు, సానేవారిపల్లిలో ప్రహరీకి రూ. 2లక్షలు, ఓరు వాయి ప్రాథమిక పాఠశాల గేటుకు రూ.1.5లక్షల నిధులు అలానే ఉన్నాయి. నిధులున్నా, ప్రభుత్వ ఆదేశాలు రాకపోవ డంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపో యాయి. అసంపూర్తిగా మరుగుదొడ్లు ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వంట గదులు నిర్మాణంలో ఉండడంతో ఆరుబయటే వంట చేస్తు న్నారు. అయితే ఈ నిధులను మండలంలో నూతనంగా చేపట్టనున్న మోడల్‌ స్కూల్‌ నిర్మాణానికి వెచ్చించ నున్నట్లు తెలుస్తోంది.


ప్రహరీకి నోచుకోని పాఠశాల

నంబులపూలకుంట మండలంలోని ధనియానచెరువు జిల్లా పరిషత ఉన్నత పాఠశాలకు నూతన ప్రహరీ ని ర్మాణం పునాదులకే పరిమితం కావడంతో పాఠశాల ఆ వరణంలో మూగజీవాలు విచ్చలవిడగా సంచరిస్తున్నా యి. అలాగే రాత్రిళ్లు మందుబాబులు, జూదరులకు అ డ్డాగా మారుతోంది. పాఠశాలలో అదనపు గదులు, మూత్రశాలల నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో వి ద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. తా గడానికి నీరు లేకపోవడంతో ఉపాధ్యాయులే క్యాన్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి విద్యార్థులకు అందజేస్తున్నారు. ఈ పా ఠశాలలో బెంచీలు కూడా లేవు. ప్రహరీ నిర్మించకపోవ డంతో ఆ స్థలం కబ్జాకు గురయ్యే అవకాశం ఉందని గ్రామస్థులు అంటున్నారు. పాఠశాలలో కడ్డీలు, ఇసుక, కంకర అలాగే ఉన్నాయి. సోమరాజుకుంట, ఎన్పీకుంట కేబీబీవీలో సిమెంటు గట్టకట్టుకుని పోయింది. కొను గోలు చేసిన సామాగ్రిని భద్రపరుచుకోవడానికి ప్రధానో పాధ్యాయులు నానా తంటాలు పడుతున్నారు. సా మగ్రిని కొందరు ఎత్తుకెళ్లిపోతున్నట్లు ప్రధానోపాధ్యా యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిధులు ఖర్చుచేయకూడదని ప్రభుత్వ ఆదేశం

‘నాడు- నేడు’ కింద పాఠశాలలకు విడుదల చేసిన నిధులను ఖర్చు చేయకూడదని ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి. ఆ మేరకు ఎక్కడా నిధులు ఖర్చు చేయడం లేదు. - గోపాల్‌నాయక్‌, ఎంఈఓ, ఎన్పీకుంట


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Aug 20 , 2025 | 12:26 AM