TEMPLE: ఆస్తులున్నా.. హారతులేవీ..?
ABN , Publish Date - Dec 09 , 2025 | 11:38 PM
ఒకప్పుడు దూప, దీప, నైవేద్యాలతో కలకలలాడిన ఆలయం నేడు పూజలు కరువై వెలవెలబోతోంది. కొంతమంది దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టడంతో ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. నల్లమాడ మండలం కురమాల గ్రామ సమీపంలోని చెన్నకేశవస్వామి ఆలయం నిరాదరణకు గురవుతోంది. గతంలో ఆలయం నిత్యం భక్తులతో కలకలాడుతుండేది.
20 ఎకరాల మాన్యం ఉన్నా.. పూజలు కరువు
శిఽథిలావస్థలో కురుమాల చెన్నకేశస్వామి ఆలయం
నల్లమాడ, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు దూప, దీప, నైవేద్యాలతో కలకలలాడిన ఆలయం నేడు పూజలు కరువై వెలవెలబోతోంది. కొంతమంది దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టడంతో ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. నల్లమాడ మండలం కురమాల గ్రామ సమీపంలోని చెన్నకేశవస్వామి ఆలయం నిరాదరణకు గురవుతోంది. గతంలో ఆలయం నిత్యం భక్తులతో కలకలాడుతుండేది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆలయ నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. శైవులు, వైష్ణవుల మధ్య యుద్ధాల నివారణ కోసం శ్రీకృష్ణదేవరాయలు అప్పట్లో చెన్నకేశవస్వామి ఆలయం నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ ఆలయానికి 20 ఎకరాల మాన్యం ఉంది. అయినా ఎలాంటి పూజలు లేవు. కురమాలకు చెందిన తలసాని కేశవరెడ్డి గతంలో రెవెన్యూ అధికారులను సంప్రందించి మాన్యం భూమిలో
చింత- నిశ్చింత పథకం ద్వారా చింత మొక్కలు నాటించారు. అప్పటి తహసీల్దార్ వెంకటేశం చింతమొక్కల పెంపకానికి ప్రాధాన్యమిచ్చారు. గుప్త నిధుల కోసం ఆలయ పరిసరాలను దుండగులు తవ్వేశారు. గర్భగుడిలో విగ్రహాన్ని సైతం తొలగించారు. కొద్దిరోజుల క్రితం గ్రామస్థులు ఆలయంలో చెన్నకేశవస్వామి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. ఇక్కడే దేవరగూడి అనే గ్రామం ఉండేది. ఈ గ్రామం కాలగర్భంలో కలిసిపోయింది. ఆ గ్రామానికి సమీపంలో దాతలు 30 అంకనాల సత్రం నిర్మించి, బావిని తవ్వించారు చెన్నకేశవస్వామి భక్తులకు విడిది, భోజనాలు వండుకోవడానికి వీటిని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆలయం వద్ద బావి ఉంది. సత్రాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆలయంలో దూపదీప నైవేద్యాలు కనుమరుగయ్యాయి. ఆలయంలో గతంలో వివాహాలు అధికంగా జరిగేవి. ప్రజాప్రతినిధులు, అఽధికారులు చొరవ తీసుకుని ఆలయ అభివృద్ధికి కృషిచేయాలని భక్తులు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....