CRUSHER: పంచాయతీ పన్నుల ఎగవేత
ABN , Publish Date - Oct 11 , 2025 | 12:12 AM
గ్రామీణ ప్రాంతాల్లో ఏదైనా పరిశ్రమ నెలకొల్పితే అందులో స్థానికులకు, సంబంధిత పంచాయతీలకు లబ్ధి, ఆదాయం చేకూరుతుంది. అయితే మండలంలోని వేపరాళ్ల పంచా యతీలో పరిస్థితి మరోరకంగా ఉంది. వేపరాళ్ల పంచాయతీలోని పాలకాల వ గ్రామ సమీపంలో స్టోనక్రషర్ మిషన ఏర్పాటు చేశారు.
- స్థానికులకు ఉపాఽధి కల్పన శూన్యం
- స్టోన క్రషర్ల యజమానుల తీరుపై విమర్శలు
గాండ్లపెంట, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో ఏదైనా పరిశ్రమ నెలకొల్పితే అందులో స్థానికులకు, సంబంధిత పంచాయతీలకు లబ్ధి, ఆదాయం చేకూరుతుంది. అయితే మండలంలోని వేపరాళ్ల పంచా యతీలో పరిస్థితి మరోరకంగా ఉంది. వేపరాళ్ల పంచాయతీలోని పాలకాల వ గ్రామ సమీపంలో స్టోనక్రషర్ మిషన ఏర్పాటు చేశారు. సమీపంలో ఉన్న గుట్టలు, కొండల్లోని తెల్లరాతిని తీసుకొచి ఇక్కడ పొడి చేసే పరిశ్రమ నెలకొల్పారు. దీని ద్వారా స్థానిక పంచాయతీ వాసులకు ఉపాధి కల్పించా లి. అయితే స్థానికులను పక్కన పెట్టి ఇతర రాష్ర్టాల వారికి పనులు కల్పి స్తున్నారని ఇక్కడి ప్రజలు వాపోతున్నారు. అలాగే పంచా యతీకి అరకొర గా పన్నులు కట్టి ఆదాయానికి గండి కొడుతున్నారని విమర్శిస్తున్నారు.
అధికారుల కుమ్మక్కు - పన్నులకు ఎగనామం
మండలంలో ఎక్కడైనా ఏదైనా పరిశ్రమ నెలకొల్పాలంటే సంబంధిత పంచాయతీ సర్పంచు, కార్యదర్శులు, స్థానిక ప్రజలతో చర్చించి ఏర్పాటు చేయాలి. అదేవిధంగా నిర్ధేశించిన పన్నులను పంచాయతీకి చెల్లించిన తర్వాత, పంచాయతీ అధికారుల అనుమతులు పొంది పరిశ్రమ నెలకొల్పి, నడుపుకోవాలి. అయితే వేపరాలలోని పెద్దల పేరుచెప్పి పంచాయతీకి మొ క్కుబడిగా పన్నులు చెల్లించి స్టోన క్రషర్ పరిశ్రమను నడుతున్నారని స్థాని క ప్రజల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.
అంతేగాకుండా వేపరాల పంచాయతీలోని ఓ స్టోనక్రషర్ యాజమానులు గతంలో అధికారులతో కుమ్మక్కై పంచాయతీకి కట్టాల్సిన పన్నులు కట్టలేదని సమాచారం. ప్రస్తు తం అదే గ్రామంలో ఇంకో స్టోన క్రషర్ పరిశ్రమ ఏర్పాటుచేశారు. దానికి సంబంధించి కూడా పంచాయతీకి అంతంత మాత్రమే పన్నులు చెల్లిం చారని పంచాయతీవాసులు ఆరోపిస్తున్నారు. దీంతో పంచాయతీకి ఆదా యం లేకపోవడంతో ఎలాంటి అభివృద్ధి జరుగలేదని, స్థానికులకు ఉపా ధి లేదని పలువురు విమర్శిస్తున్నారు.
గుట్టు విప్పని అధికారులు
వేపరాల పంచాయతీలో స్టోన క్రషర్ పరిశ్రమను గతంలో ఒకటి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇంకొకటి నెలకొల్పేందుకు పనులు ప్రారంభించారు. అయితే ఈ రెండింటి విష యంలో అధికారులు క్రషర్ యజమానులతో కుమ్మక్కై పన్నులకు గండి కొడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే పన్నుల విషయంపై పంచాయతీ కార్యదర్శిగానీ, ఎంపీడీఓగానీ నోరు మెదపక పోవడం గమనార్హం.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....