RESPONSIBILITY: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
ABN , Publish Date - Aug 26 , 2025 | 11:58 PM
పర్యావరణాన్ని కా పాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్, ఆర్డీఓ సువర్ణ పేర్కొన్నారు. వారు మంగళవారం పట్టణవాసులకు మట్టివినాయక ప్రతిమలను పంపిణీచేశారు.
ఆర్జే రత్నాకర్, ఆర్డీఓ సువర్ణ
మట్టి ప్రతిమల పంపిణీ
పుట్టపర్తి రూరల్, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): పర్యావరణాన్ని కా పాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్, ఆర్డీఓ సువర్ణ పేర్కొన్నారు. వారు మంగళవారం పట్టణవాసులకు మట్టివినాయక ప్రతిమలను పంపిణీచేశారు. ఈ .కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి సామ కోటి ఆదినారాయణ, మునిసిపల్ మాజీ చైర్మన పీసీ గంగన్న, బీజేపీ నాయకులు కత్తిరాజారెడ్డి శివ తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం: స్థానిక కాకతీయ విద్యానికేతన విద్యార్థులు మంగళవారం బంకమట్టితో గణపయ్యలను తయారుచేసి ‘మట్టి గణపయ్యలనే పూజిద్దాం...పర్యావరణాన్ని కాపాడుకుందాం’ అంటూ నినదించారు. పాఠశాల కరస్పాండెంట్ నిర్మలాదేవి డైరెక్టర్లు శెట్టిపి సూర్యప్రకాశరెడ్డి, శెట్టిపి పద్మ. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కదిరి అర్బన: వినాయ చవితి పండుగ సం ద ర్భంగా మంగళ వారం పట్టణంలో శ్రీఖాద్రీ నరసిం హ సేవా సమితి, తిరుపాల్ హో టల్, తన్వీక్ మొబైల్స్ సంయుక్త ఆధ్వర్యంలో మట్టి ప్రతిమలను పంపిణీ చేశారు. పట్టణవాసులు సంపతలక్ష్మి, అనుదీప్, హర్ష, లక్ష్మణ్, కార్తీక్, రాజేంద్ర, హరిప్రసాద్, లక్ష్మీపతి, అరవింద్ తదితరులు ఉన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....