NSS: పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యానికి భద్రత
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:49 PM
పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యానికి భద్రత అని ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ధర్మవరంలోని కేహెచ ప్రభుత్వ డిగ్రీకళాశాల ఎనఎస్‌ఎస్ వలంటీర్లు మండలంలోని గొట్లూరులో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబి రాన్ని ఆయన శనివారం సందర్శించారు.
ధర్మవరంరూరల్, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యానికి భద్రత అని ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ధర్మవరంలోని కేహెచ ప్రభుత్వ డిగ్రీకళాశాల ఎనఎస్‌ఎస్ వలంటీర్లు మండలంలోని గొట్లూరులో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబి రాన్ని ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎనఎస్‌ఎస్ వలంటీర్లు గ్రామంలోని చెత్త నుంచి సంపదతయారీ కేంద్రం వద్ద నుంచి ప్రభుత్వపాఠశాల, అంబేడ్కర్ కమ్యూని టీహాల్, ఆర్డీటీ పాఠశాల ప్రాంతాలలో ప్లాస్టిక్, వ్యర్థపదార్థాలు, పిచ్చిమొక్కలను తొలగించారు. ఈ కార్యక్రమంలో ఎనఎస్‌ఎస్ యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్ గోపాల్‌నాయక్, గొట్లూరు గ్రామ పంచాయతీ అధికారి గణేష్ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....