MAGISTRATE: ప్రోత్సాహంతో దివ్యాంగుల రాణింపు
ABN , Publish Date - Dec 04 , 2025 | 12:35 AM
దివ్యాంగులను ప్రోత్సహిస్తే మిగతావారితో సమంగా రాణించగలరని జూనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి మజీదు సయ్యద్ పస్పల్లా పేర్కొన్నారు. స్థానిక బాలుర ఉన్నతపాఠశాలలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి న్యాయాధికారితో పాటు సీఐ మారుతీశంకర్, బార్ అసోసియేషన ప్రెసిడెంట్ గంగిరెడ్డి, ఎంఈఓ-1 సోమశేఖర్‌నాయుడు, ఎంఈఓ-2 జయచంద్ర ముఖ్య అతిఽథులుగా హాజరయ్యారు.
జూనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి
కొత్తచెరువు, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): దివ్యాంగులను ప్రోత్సహిస్తే మిగతావారితో సమంగా రాణించగలరని జూనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి మజీదు సయ్యద్ పస్పల్లా పేర్కొన్నారు. స్థానిక బాలుర ఉన్నతపాఠశాలలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి న్యాయాధికారితో పాటు సీఐ మారుతీశంకర్, బార్ అసోసియేషన ప్రెసిడెంట్ గంగిరెడ్డి, ఎంఈఓ-1 సోమశేఖర్‌నాయుడు, ఎంఈఓ-2 జయచంద్ర ముఖ్య అతిఽథులుగా హాజరయ్యారు. అనంతరం న్యాయాధికారి మాట్లాడుతూ దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహమిస్తోందన్నారు. ఫలితంగానే నేడు అనేక క్రీడల్లో దివ్యాంగులు సత్తా చాటుతున్నారని తెలిపారు. అనంతరం ఇటీవల దివ్యాంగులకు నిర్వహించిన ఆటలపోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మెప్మా పీడీ రమాదేవి, రిటైర్డ్ ఉపాధ్యాయులు నాగేంద్రప్రసాద్, మల్లికార్జున, పాఠశాల హెచఎం గోపాల్, ఈఐఈఆర్‌టీలు రమేశబాబు, మల్లికార్జున, రామ్మోహనరెడ్డి, శ్రీనివాసులు, పద్మజ, అరుణ, ఐసీడీఎస్ ప్రభావతి పాల్గొన్నారు.